-ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్ ) లో వచ్చిన అర్జీలకు త్వరిత గతిన అర్థవంతంగా పరిష్కారం చూపాలి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నిర్దేశించిన గడువులోగా అర్థవంతంగా పరిష్కారంకోసం చూపాలని, అలసత్వం వహించరాదని జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ అధికారులకు సూచించారు. సోమవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డిఆర్ఓ పెంచల్ కిషోర్, డిప్యూటీ కలెక్టర్లు నరసింహులు, దేవేంద్ర రెడ్డి లతో కలిసి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు.
శాఖల వారీగా అర్జీల వివరాలు
రెవెన్యూ శాఖ – 120 , పంచాయతీరాజ్ శాఖ -08, డి.ఆర్.డి.ఏ – 15, పోలీస్ శాఖ -6, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ -4, స్కిల్ డెవలప్మెంట్ -1, మునిసిపల్ కార్పొరేషన్ – 9, విద్యుత్ శాఖ-1, పశుసంవర్ధక శాఖ -1, అగ్నిమాపక శాఖ -1, ఐ సి డి ఎస్ పిడి-1, వైద్య ఆరోగ్యశాఖ- 2, పౌరసరఫరాల శాఖ -3, కోపరేటివ్ సొసైటీ -1, పిడి డ్వామా – 6, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ – 1, సోషల్ ఆడిట్ -1, వ్యవసాయ శాఖ -1, నేషనల్ హైవే -2, డిఇఓ -1, బీసీ కార్పొరేషన్ -1, వెరసి మొత్తం 187 వినతులు రావడం జరిగిందని అధికారులు అందరు సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా నాణ్యతగా, అర్థవంతంగా పరిష్కరించాలని గ్రీవెన్స్ కు హాజరయిన వివిధ శాఖలకు సంబందించిన అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు.
Prajavartha Online Telugu News