Breaking News

లబ్ధిదారునికి మనోధైర్యం కల్పించిన మంత్రి కందుల దుర్గేష్

తూర్పు గోదావరి జిల్లా, విజ్జేస్వరం, నేటి పత్రిక ప్రజావార్త :
బ్రెయిన్ ఆపరేషన్ జరిగిన విజ్హేశ్వరం కి చెందిన చడల్లా సత్యనారాయణ కు కూటమి ప్రభుత్వం వొచ్చిన తరువాత పెన్షన్ల మొత్తాన్ని 15 వేలకు పెంచి ఇవ్వడం వల్ల మా కుటుంబానికి, నా మందులకు ఎంతో ఆసరాగా ఉందని పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నగదును అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ లబ్ధిదారునికి మనోధైర్యం కల్పించి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి అనారోగ్య సమస్యలు తో బాధపడుతున్న వారికి 15 వేలకు పెన్షన్ పెంచి అందించడం జరుగుతోందని తెలిపారు. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని మంత్రి సత్యనారాయణ కు మనోధైర్యాన్ని కల్పించడం జరిగింది

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *