Breaking News

పింఛన్ పంపిణీని అడ్డం పెట్టుకుని ప్రాణాలు తీసిన వ్యక్తి జగన్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. కూటమి ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లని పేర్కొన్నారు. బాపట్ల జిల్లాలోని జే పంగలూరులో మంగళవారం మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పర్యటించారు. స్థానికంగా ఉన్న వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు మంత్రి పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడారు… పింఛన్ల పంపిణీలో ఏపీ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. ప్రతీ నెల సరిగ్గా ఒకటో తారీఖున పింఛన్లు ప్రతీ లబ్ధిదారునికి ఇంటికెళ్లి అందజేస్తున్నామని పేర్కొన్నారు. గత ఎన్నికల సమయంలో పింఛన్ల పంపిణీని అడ్డం పెట్టుకుని వైసీపీ నాయకులు రాజకీయ లబ్ధి పొందాలని చూసినట్లు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. పింఛన్ పంపిణీ పేరుతో వృద్ధులను సచివాలయాల చుట్టూ తిప్పి వారి ప్రాణాలు తీశారని ఆరోపించారు. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కేవలం సచివాలయ సిబ్బంది ద్వారా ఒక్కరోజులోనే పింఛన్ల పంపిణీ పూర్తి చేస్తున్నామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి గా ఉండి జగన్ రెడ్డి పింఛన్ వెయ్యి రూపాయిలు పెంచాలంటే ఐదేళ్లు పట్టిందని, అదే చంద్రబాబు నాయుడు సీఎం అయిన వెంటనే వెయ్యి రూపాయిలు పెంచి లబ్ధిదారులకు అందించారని గుర్తు చేశారు.

పింఛను పంపిణీ కార్యక్రమం అనంతరం జే పంగలూరు లోని ఎంపీడీఓ ఆఫీసులో ప్రజావేదిక నిర్వహించారు. స్థానికంగా ఉండే సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వయం మంత్రి గొట్టిపాటి స్వీకరించి వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి పూర్తి అయ్యేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. స్థానికంగా ఉన్న ఓ కాలనీ లో నిధులు లేక సిమెంట్ రోడ్డు ఆగిపోయిందని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు. దీనిపై స్పందించిన మంత్రి గొట్టిపాటి సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణమే రూ.30 లక్షలు విడుదల చేయించారు. కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కోసం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

పీఎం కుసుమ్ పథకం పై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడారు. ఈ పథకాన్ని గ్రామాల్లోని ప్రజలు ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ అందనున్నట్లు తెలిపారు. వ్యవసాయేతర భూముల్లో సోలార్ ప్లాంట్ ను పెట్టి మూడు నుంచి 5 మెగా వాట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని పేర్కొన్నారు. ఇలా ఉత్పత్తి అయిన విద్యుత్ ను వ్యవసాయ కనెక్షన్లకు ఉపయోగించి, అనంతరం స్థానికంగా ఉండే సబ్ స్టేషన్ ద్వారా గ్రిడ్ కు కనెక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుందని చెప్పారు. దీనితో పాటు రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవచ్చని మంత్రి గొట్టిపాటి తెలిపారు. వీటి ద్వారా కూడా 3కేవీ విద్యుత్ ను ఉత్పత్తి చేయవచ్చని సూచించారు. విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా భవిష్యత్తు అవసరాలు తీర్చుకోవచ్చని స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *