Breaking News

బీసీల బాగే బాబు లక్ష్యం

-రాష్ట్ర బీసీ శాఖ మంత్రి సవిత
-సీడ్ పథకంతో సంచార జాతుల అభివృద్ధికి పెద్దపీట
-బీసీ విద్యార్థుల విద్యకు ప్రాధాన్యమిస్తున్నామన్న మంత్రి
-బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో సీసీ కెమెరాలు
-100 బీసీ హాస్టళ్లలో రిసోర్సు సెంటర్ల ఏర్పాట్లు చేయనున్నామని వెల్లడి
-విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక మోనటరింగ్ చేస్తామన్న మంత్రి
-డ్యాష్ బోర్డులో విద్యార్థుల హెల్త్, ప్రొగ్రెస్ రిపోర్టులు,
-బీసీల సంక్షేమానికి నిధులు కొరతరానివ్వబోం : మంత్రి సవిత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బీసీల బాగే సీఎం చంద్రబాబు లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళిశాఖా మాత్యులు ఎస్.సవిత తెలిపారు. బీసీ-ఏలో ఉన్న సంచార జాతుల జీవన ప్రమాణాలు పెంచే కేంద్ర ప్రభుత్వం సహకారంతో సీడ్ పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. బీసీ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో సీసీ కెమెరాల ద్వారా మోనటరింగ్ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. బీసీ కులాల చేతి వృత్తుల వారికి మరింత మెరుగైన శిక్షిణిచ్చి ఆర్థిక చేయూతనందించడానికి సీఎం చంద్రబాబునాయుడు ప్రణాళికులు సిధం చేశారన్నారు. విజయవాడ లోని ఓ హోటల్ లో నిర్వహించిన బీసీ సంక్షేమ శాఖలో కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలుపై వర్క్ షాప్ లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. బీసీలకు గౌరవ ప్రదమైన జీవనం అందించడానికి సీఎం చంద్రబునాయుడు కార్యాచరరణ ప్రారంభించారన్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా తీసుకుంటున్నారన్నారు. బీసీ-ఏలో ఉన్న 40 సంచార జాతుల వారి జీవన ప్రమాణాలు మెరుగుపర్చడానికి సీడ్ పథకాన్ని వినియోగించనున్నామన్నారు. సంచార జాతుల వారికి స్థిర నివాసం లేకపోవడం వల్ల ఆధార్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అందడంలేదన్నారు. దీనివల్ల వారు ప్రభుత్వ పథకాలను వినియోగించుకోలేకపోతున్నారన్నారు. ఈ విషయం గుర్తించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంచార జాతుల కు మెరుగైన జీవనం అందించడానిక సీడ్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ముందుగా వారికి స్థిర నివాసాలు ఏర్పాటు చేయడానికి ఇళ్ల నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. సంచార జాతుల మహిళలతో స్వయం సహాయక గ్రూపులు ఏర్పాటు చేయించి…స్వయం ఉపాధి కోసం రుణాలు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం ఇతర శాఖల అధికారులతో బీసీ సంక్షేమ శాఖాధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. సంచాచార జాతుల పిల్లలను పాఠశాలల్లో చేర్పించేలా ప్రోత్సాహించాలన్నారు. సంచార జాతుల్లో అక్షరాస్యత పెరిగితే వారిలో పేదరికాన్ని సులభంగా పారదొలొచ్చునన్నారు. ఏపీలో ప్రస్తుతం ఆరు రాష్ట్రాల్లో సీడ్ పథకం అమలవుతోందని, త్వరలో మిగిలిన 20 జిల్లాల్లోనూ ఈ పథకం వర్తింపజేయనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. ఈ సీడ్ పథకంలో భాగంగా ఎన్ఐ-ఎంఎస్ఎంఈ ద్వారా సంచా జాతులకు వారికి శిక్షిణిచ్చి…గ్రూపులుగా వారితో చిన్న తరహా వ్యాపార, పరిశ్రమలు ఏర్పాటు చేసేలా ప్రోత్సాహించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు.

బీసీ హాస్టళ్లలో రిసోర్సు సెంటర్ల ఏర్పాటు…
బీసీ బిడ్డలకు నాణ్యమైన విద్యనందించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారని మంత్రి సవిత తెలిపారు. ఇందుకోసం వంద హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో ఎస్ఆర్ శంకరన్ రిసోర్సు సెంటర్లు ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ సెంటర్ల ద్వారా డిజిటల్ ఎడ్యుషన్ ద్వారా బోధన సాగించనున్నామన్నారు. మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులపై ఈ రిసోర్స్ సెంటర్ల ద్వారా విద్యార్థులకు నిపుణుల ద్వారా సందేహాలు నివృత్తి చేయనున్నామన్నారు. అదే సమయంలో ట్యూటర్లకు, హాస్టళ్ల టీచర్లకు కూడా డిజిటల్ కంటెంట్ పై అవగాహన కల్పించనున్నామన్నారు.

హాస్టళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటు
బీసీ, గురుకుల హాస్టళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నామని మంత్రి తెలిపారు. దీని వల్ల విద్యార్థులను, హాస్టళ్ల పరిసరాలను నిరంతరం మోనటరింగ చేసే అవకాశం ఉంటుందన్నారు. హాస్టళ్లను బీసీ సంక్షేమ శాఖ అధికారులు తరుచూ సందర్శించాలని, విజిట్ కు సంబంధించిన రిపోర్టును ప్రతి నెలా తనకు అందజేయాలని మంత్రి ఆదేశించారు. బీసీ హాస్టళ్ల విద్యార్థులను కన్న బిడ్డల మాదిరిగా చూసుకోవాలన్నారు.

డ్యాష్ బోర్డులో విద్యార్థుల హెల్త్, ప్రొగ్రెస్ రిపోర్టులు
బీసీ హాస్టళ్లు, గురుకులాల విద్యార్థుల ఆరోగ్యంపైనా, విద్యా ప్రగతిపైనా సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి సవిత వెల్లడించారు. ప్రతి విద్యార్థి ఆరోగ్య పరిస్థితిపై రికార్డు మెయింటెయిన్ చేయాలని స్పష్టంచేశారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితుల ఆధారంగా విద్యార్థులకు వైద్య సేవలు అందించాలన్నారు. విద్యార్థులకు అందించిన వైద్య సేవలు, వాడిన మందులు వివరాలను కూడా రికార్డుల్లో రాయాలన్నారు. విద్యార్థులు అనారోగ్యానికి గురైనప్పుడు డ్యాష్ బోర్డులో ఉన్న వివరాల ఆధారంగా సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించగలుగుతామన్నారు. విద్యార్థుల విద్యా ప్రగతికి సంబంధించిన ప్రొగ్రెస్ రిపోర్టును కూడా డ్యాష్ బోర్డులో పొందుపర్చాలన్నారు. వార్డెన్లు రాత్రి సమయాల్లో తప్పనిసరిగా హాస్టళ్లలోనే ఉండాలన్నారు. ప్రభుత్వం పేర్కొన్న మెనూను పక్కాగా అమలు చేయాలన్నారు. తాగునీటి ట్యాంకర్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి స్వచ్ఛమైన తాగునీరు విద్యార్థులకు అందించాలన్నారు. నమస్తే పథకం ద్వారా హాస్టళ్లను శుభ్ర పరచాలన్నారు. స్వచ్ఛంద సేవా సంస్థలు, ఇతర ఉద్యోగుల సేవలను కూడా వినియోగించుకోవాలని మంత్రి సూచించారు.

అర్హులకే పథకాలు
బీసీ కులాల్లో వృత్తులపై ఆధారపడిన వారిని గుర్తించి…వారికి మరింత నైపుణ్యం పెరిగేలా శిక్షణ ఇచ్చి…వారికి ఆదరణ పథకాలు, ఇతర సబ్సిడీ రుణాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. ప్రభుత్వమిచ్చే రుణాలు, ఆదరణ పరికరాలు వృథా కాకుడదన్నది సీఎం చంద్రబాబున లక్ష్యమన్నారు. అర్హులకు అందలమన్న ప్రాతిపదికన పథకాలు వర్తింపజేయనున్నామన్నారు. ఇందుకోసం బీసీ సంక్షేమ శాఖాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, అర్హులను ఎంపిక చేయాలని మంత్రి స్పష్టంచేశారు.

అన్ని కాంపిటేటీవ్ పరీక్షలకు శిక్షణ
అన్ని జిల్లా కేంద్రాల్లోనూ బీసీ స్టడీ సర్కిళ్లను బలోపేతం చేయనున్నామని మంత్రి తెలిపారు. ఈ స్డడీ సర్కిళ్ల ద్వారా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు పడినప్పుడు కాకుండా ముందు నుంచే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు కేటగిరీల వారీగా నిరుద్యోగులకు శిక్షణివ్వనున్నామన్నారు. అమరావతిలో సివిల్ సర్వీసు అభ్యర్థుల కోసం శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఇందుకోసం అమరావతిలో స్థలం కేటాయించాలని సీఎం చంద్రబాబును కోరినట్లు మంత్రి వెల్లడించారు. తాత్కాలికంగా గొల్లపూడిలో సివిల్ సర్వీసు అభ్యర్థులకు శిక్షణ అందించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

నిధుల కొరత లేదు…
బీసీలను అన్ని విధాలా ఆదుకోడానికి సీఎం చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నారని మంత్రి సవిత వెల్లడించారు.. ఇటీవల జరిగిన సమీక్షలో బీసీ సంక్షేమ శాఖకు సీఎం చంద్రబాబునాయుడు నిధులు మంజూరు చేయాలని ఆర్థిక శాఖాధికారులను ఆదేశించారన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన మ్యాచింగ్ గ్రాంట్ లు ఎప్పటికప్పుడు ఇచ్చేలా సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారన్నారు. బీసీ సంక్షేమ శాఖలో నిధుల కొరత అనే మాటకు తావేలేదన్నారు. బీసీ భవన్ల నిర్మాణాలకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ పోలా భాస్కర్, డైరెక్టర్ మల్లికార్జున, ఎన్ఎం ఎంఎస్ఎంఈ డైరెక్టర్ జనరల్ స్వరూప తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఇంద్రకీలాద్రి పై సంక్రాంతి వేడుకలు 2 వ రోజు…

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : తేదీ. 13-01-2025 నుండి తేదీ. 15-01-2025 వరకు సంక్రాంతి వేడుకలు సందర్బంగా మంగళవారం  ‘సంక్రాంతి’ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *