Breaking News

అమ్మవారికి బంగారు వజ్ర కిరీటం సమర్పణ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం అమ్మవారికి అలంకరణ నిమిత్తం పీనేన్స్ కమర్శియల్ ప్రై లిమిటెడ్, ఆర్ ఓ సి, ముంబై కి చెందిన సౌరబ్ బోరా  1817 గ్రాముల బరువు కలిగిన బంగారు వజ్ర కిరీటం ను, విష్ణు మేడోస్, బంజారా హిల్స్, హైదరాబాద్ కు చెందిన సి ఎం రాజేష్ గారు 210 గ్రాముల బంగారు డైమండ్ సూర్యుడు (సూర్యబింబం), చంద్రబింబం(207 గ్రాములు) మరియు ఏమిరాల్డ్ ఫర్నిచర్, కొండాపూర్, హైదరాబాద్ కు చెందిన హైమావతి సూర్య కుమారి లు వజ్ర బొట్టు, వజ్ర నత్తు వజ్రపు బులాకి మొత్తం 33 గ్రాముల బరువు లను పశ్చిమ శాసనసభ్యులు వై సుజనా చౌదరి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సత్యనారాయణ, ఆలయ ఈవో కె ఎస్ రామరావు ల చేతుల మీదుగా దేవస్థానం నకు అందజేశారు. దాత కు వీరు అమ్మవారి దర్శనం కల్పించగా, బాలత్రిపుర సుందరీ దేవి గా దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకొనగా, వేదపండితులచే వేదార్వచనం కల్పించి, అమ్మవారి ప్రసాదములు, చిత్రపటం అందజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *