విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బ్రెయిలీ ప్రెస్, గుంటూరు నందు అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన మెషీన్ ఆపరేటర్ పోస్టునకు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారి నుండి దరఖాస్తులు ఆహ్వానించడమైనదని ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సహాయ సంస్థ మేనేజింగ్ డైరక్టర్ ఎం.ఎ. కుమార్ రాజా సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.. అర్హత కలిగిన వారు తమ బయోడేటా వివరాలు, విద్యార్హతలు మరియు అనుభవము కు సంబంధించిన ధ్రువపత్రాలు జతపరచి తేది. 17-10-2024 లోపు స్వయంగా గాని/ పోస్టు ద్వారా గాని పంపవలెనని కోరారు.. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయస్సులో సడలింపులు వర్తిస్తాయన్నారు. దరఖాస్తులు పంపవలసిన చిరునామా .. మేనేజింగ్ డైరక్టరు, ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సహాయ సంస్థ, డోర్ నెం. 74-14-2, రాజనరేంద్ర బిల్డింగ్ మొదటి అంతస్తు, యనమలకుదురు రోడ్, కృష్ణ నగర్, విజయవాడ – 520 007. అర్హత మరియు పూర్తి వివరాలకు వెబ్ సైట్ www.apdascac.ap.gov.in లో కూడా వీక్షించవచ్చు.
Tags vijayawada
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News