పవిత్ర యునిక్ సిల్వర్ జ్యువలరీ ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే సందడి చేసింది. పిన్నమనేని పాలీ క్లినిక్ రోడ్డు లో నూతనంగా ఏర్పాటు చేసిన పవిత్ర యునిక్ సిల్వర్ జ్యువలరీ షోరూమ్ ను భాగ్యశ్రీ బోర్ సే ముఖ్య అతిథిగా విచ్చేసి షోరూమ్ను లాంచనంగా ప్రారంభించారు. షో రూమ్ లో ఏర్పాటుచేసిన వివిధ రకాల సిల్వర్ మోడల్స్ను పరిశీలించి వాటిని ఎలా తయారు చేస్తారని అంశాలను షోరూమ్ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. వినూత్న డిజైన్స్ను ధరించి ఫోటోలకు ఫోజులిచ్చారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వెండితో తయారుచేసిన వివిధ రకాల ఆభరణాలు ఆకట్టుకుంటున్నాయన్నారు. బంగారంకు పోటీగా వెండి లో కూడా వివిధ రకాల డిజైన్స్ ఉన్నాయన్నారు. విజయవాడ నగర ప్రజలు పవిత్ర యునిక్ సిల్వర్ జ్యువలరీ షోరూం కు విచ్చేసి ఇక్కడ లభించే వెండి వజ్రాభరణాలను వీక్షించాలని ఆమె కోరారు. అనంతరం షోరూం నిర్వాహకులు కొల్లిపర రాజేష్ మాట్లాడుతూ వెండి ఆభరణాల విక్రయాలలో తమకు ఎంతో అనుభవం ఉందని విజయవాడ నగర ప్రజల అభిరుచులకు అనుగుణంగా పవిత్ర యునిక్ సిల్వర్ జ్యువలరీ షోరూమ్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నగర ప్రజలు తమ షోరూమ్ కు విచ్చేసి ఇక్కడ లభించే సిల్వర్ జువెలరీ ఆభరణాలను కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో షోరూం నిర్వాహకులు సాయి మెహర్, కిషోర్, రఘురామ్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *