Breaking News

ఎయిర్ కండిషనర్, కూలర్స్, రిఫ్రిజిరేటర్స్ మెకానిజమ్ పై ఉచిత వృత్తి విద్యా శిక్షణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆధ్వర్యంలో, బ్యాంకర్ల గ్రామీణ మరియు ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ, హైదరాబాద్ BIRED వారి సహకారంతో, వరద ముంపు ప్రాంత యువకుల ఆర్థిక అభ్యున్నతికై ఎయిర్ కండిషనర్, కూలర్స్, రిఫ్రిజిరేటర్స్ మెకానిజమ్ పై ఉచిత వృత్తి విద్యా శిక్షణ కార్యక్రమము “భారత వికాస్ పరిషత్ భవనము, రాజీవ్ నగర్, విజయవాడ” నందు అతి త్వరలో ప్రారంభించునున్నట్లు ఎన్. టి. ఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్. శ్రీనివాసరావు తెలియజేసారు.

ఈ శిక్షణకు 10వ తరగతిలో పాస్ లేదా ఫెయిల్ అయిన 19 నుండి 30 సం॥ల యువకులు అర్హులనీ, శిక్షణ కాలవ్యవధి 37 రోజులనీ, శిక్షణా తరగతులు ఉదయం 10 గం॥ల నుండి సాయంత్రం 5 గం||ల వరకు నిర్వహించబడుననీ, శిక్షణా కాలంలో ఉచిత మధ్యాహ్న భోజనం సదుపాయం కలదని, శిక్షణా కాలములో వర్కింగ్ మెటీరియల్ ఉచితంగా ఇవ్వబడుననీ తెలియజేసారు.

శిక్షణ పూర్తి చేసుకున్న వారికి, శిక్షణ అనంతరం సర్టిఫికేట్ ఇవ్వబడుననీ మరియు సర్టిఫికేట్ పొందిన యువకులకు ప్రఖ్యాత L.G., CARRIER AIRCON, BLUE STAR, DIAKIN కంపెనీలలో క్యాంపస్ ప్లేస్మెంట్కు అవకాశము కలదనీ, ఈ ఉచిత శిక్షణలో 40 మంది యువకులకు మాత్రమే అవకాశము కల్పించబడుననీ, ఇటీవల వచ్చిన వరద ముంపు ప్రాంతాలలో నివాసం ఉంటున్నవారికి మొదట ప్రాధాన్యత ఉంటుందనీ తెలిపారు.

కావున, తగిన అర్హతలు కలిగి ఉపాధికై ఎదురు చూచుచున్న యువకులు దరఖాస్తు చేసుకొనవలసినదిగా కోరారు. వివరముల కొరకు, గణేష్: 99512 84459, గంగాధర్: 78934 16244, తులసీ రామ్: 9032840287 సంప్రదించవచ్చునని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *