Breaking News

తిరుపతి జిల్లాలో నడికుడి శ్రీకాళహస్తి మధ్య రైల్వే లైను కు సంబంధించిన పెండింగ్ భూసేకరణ పనుల పురోగతి వేగవంతం చేస్తాం

-జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వ ప్రగతి కార్యక్రమం పనుల పురోగతిపై ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రద్యుమ్న కేంద్ర రైల్వే శాఖ ఉన్నతాధికారులు, ప్రిన్సిపల్ సెక్రెటరీ రవాణా మరియు ఆర్ అండ్ బి కాంతిలాల్ దండే లతో కలిసి పలు జిల్లాల కలెక్టర్లు, జెసిలతో మరియు సంబంధిత అధికారులతో వర్చువల్ విధానంలో మంగళవారం మధ్యాహ్నం సమీక్ష నిర్వహించగా నడికుడి శ్రీకాళహస్తి మధ్య రైల్వే లైను కు సంబంధించిన పెండింగ్ పనుల పురోగతిపై తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జెసి శుభం బన్సల్ తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సిఎం కార్యదర్శికి కలెక్టర్ వివరిస్తూ తిరుపతి జిల్లాలో నడికుడి శ్రీకాళహస్తి మధ్య రైల్వే లైను కు సంబంధించిన పెండింగ్ లో ఉన్న సుమారు 182 ఎకరాల డికేటి భూములకు సంబంధించిన పెండింగ్ అవార్డు పాసింగ్ త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. అలాగే తిరుపతి బైపాస్ పెండింగ్ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి పురోగతి సాధిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా సెక్రెటరీ మాట్లాడుతూ పెండింగ్ పనులను వేగవంతం చేయాలని సూచిస్తూ, పెండింగ్ నిధులపై సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ నందు కలెక్టరేట్ భూ సేకరణ డిటి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *