Breaking News

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకుల ఏర్పాట్ల పరిశీలన

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదివారం ఉదయం ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం ఎంజీ రోడ్డు నందు పర్యటించి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకుల ఏర్పాట్లను పరిశీలించారు. అక్టోబర్ 21, 2024న జరిగే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లకు పార్కింగ్, గ్రౌండ్ అరేంజ్మెంట్స్, పెరేడ్ మార్కింగ్ ట్రాక్స్, త్రాగునీటి సరఫరా, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాట్లను పరిశీలించారు. వేడుకలకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూసుకునేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వేడుకలో పారిశుద్ధ్య నిర్వహణ పక్కగా జరగాలని ఆదేశించారు. ఈ పర్యటనలో ఎస్టేట్ ఆఫీసర్ టి శ్రీనివాస్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రామకోటేశ్వరరావు, ఇంజనీరింగ్ శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *