Breaking News

పోలీస్ అమరవీరుల త్యాగాల ఫలితమే సమాజానికి స్వేచ్ఛ: హోం మంత్రి వంగలపూడి అనిత

-కె.ఎస్.వ్యాస్ , ఉమేష్ చంద్ర, పరదేశి నాయుడు వంటి పోలీస్ లు ఆదర్శం
-తెగువను నేర్పిన పోలీస్ తల్లిదండ్రులు, కుటుంబాలకు సెల్యూట్
-టెక్నాలజీని వినియోగించుకుని సైబర్ నేరాలను నియంత్రిస్తాం
-6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలను రాబోయే 6 నెలల్లో భర్తీ చేస్తాం
-బందోబస్తు సమయంలో పోలీసుల పనితీరు ప్రశంసనీయం
-రూ.10 కోట్లతో సైనిక్ కార్పొరేషన్ ఏర్పాటు చేశాం
-సీఎం చంద్రబాబు నాయకత్వంలో పోలీసుల సంక్షేమం దిశగా అడుగులు
-‘పోలీస్ అమరవీరులను సంస్మరించుకునే రోజు’ సందర్భంగా హోం మంత్రి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పోలీస్ అమరవీరుల త్యాగాల వల్లనే సమాజం స్వేచ్ఛగా బతుకుతుందని హోం మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. తెగువను నేర్పుతూ కని, పెంచిన పోలీసుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు ఆమె సెల్యూట్ చేశారు. సోమవారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన ‘పోలీసు అమరవీరుల సంస్మరణ దినం’ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ విధి నిర్వహణలో తమ ప్రాణాలను త్యాగం చేసిన వారికి ఈ సమాజం రుణపడి ఉందన్నారు. సంఘ విద్రోహ శక్తులను ఎదిరించి తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన కె.ఎస్.వ్యాస్ , ఉమేష్ చంద్ర, పరదేశి నాయుడు వంటి వారెందరో పోలీస్ వ్యవస్థకే ఆదర్శమన్నారు. పోలీస్‌ అమరవీరుల స్థూపం వద్ద కర్తవ్య నిర్వహణలో తమ ప్రాణాలను కోల్పోయిన వారికి ఈ సందర్భంగా హోం మంత్రి అనిత నివాళులర్పించారు.నవతరానికి ఉత్సాహాన్ని స్ఫూర్తిని, ప్రేరణను రగిలించడమే పోలీసు అమరవీరుల సంస్మరణ నిర్వహించుకోవడం వెనుక ముఖ్య ఉద్దేశ్యమన్నారు.

సీఎం చంద్రబాబు నాయకత్వంలో పోలీసుల సంక్షేమం దిశగా అడుగులు : హోం మంత్రి
సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పోలీస్ అమరవీరుల కుటుంబాల సంక్షేమం దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. రూ.10 కోట్లతో సైనిక్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే అందుకు నిదర్శనమన్నారు. టెక్నాలజీని వినియోగించుకుని సైబర్ నేరాలను నియంత్రిస్తామని హోం మంత్రి వెల్లడించారు. విజయవాడ కమిషనరేట్ కేంద్రంగా సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేక యాప్ ను తీసుకువచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. సైబర్‌ నేరాలు, మానవ అక్రమ రవాణాపై సామాన్యులకు తెలిసేలా అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రత్యేక మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిందని ఆమె స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో నిలిచిన 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలను రాబోయే 6 నెలల్లో భర్తీ చేస్తామని ఈ సందర్భంగా హోం మంత్రి తెలిపారు. తుపానులు, వరదలు, దసరా శరన్నవరాత్రులు, శ్రీవారి బ్రహ్మోత్సవాల బందోబస్తులో పోలీసుల పనితీరును ఆమె ప్రశంసించారు. విజయవాడ వరదల్లో ప్రజల ప్రాణాలను కాపాడడంలో పోలీసులు, ఫైర్ సిబ్బంది అందించిన సేవలు యావత్ దేశాన్ని కదిలించాయన్నారు. సోషల్ మీడియా ప్లాట్ ఫాంల ద్వారా యువత.. డ్రగ్స్, గంజాయి బారిన పడకుండా అవగాహన కలిగించి అప్రమత్తం చేస్తామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *