Breaking News

భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, వంకల కింద ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి

-జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్

అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు, వంకల కింద ఉన్న లోతట్టు ప్రాంతాలలో నివాసముంటున్న ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో కూడా భారీ వర్షం కురుస్తుండడంతో ఆ జిల్లా నుంచి జిల్లాకు వచ్చే వాగులు, వంకల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే సోమవారం రాత్రి భారీ వర్షం కురిసిందని, జిల్లాలో చెరువులు, వాగులు కింద ఉండే లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలంతా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *