Breaking News

ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన ముస్లిం సంఘాల ప్రతినిధులు, ఎమ్మెల్యేలు

-కేంద్రం ప్రతిపాదించిన వక్ఫ్ యాక్ట్ అమెండ్మెంట్ పై తమ అభ్యంతరాలు వివరించిన ప్రతినిధులు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆలిండియా ముస్లిం లా బోర్డు సహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పలు ముస్లిం సంఘాల ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రి ఎన్ఎండి ఫరూఖ్, మండలి మాజీ చైర్మన్ షరీఫ్ సహా పార్టీ మైనారిటీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సచివాలయంలో కలిశారు. వక్ఫ్ యాక్ట్ సవరణపై కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై తమ అభ్యంతరాలు తెలిపారు. కేంద్రం తీసుకువచ్చిన ఈ ప్రతిపాదన వల్ల వక్ఫ్ బోర్డు నిర్వీర్యం అవుతుందని….ఈ చర్య ముస్లిం వర్గ హక్కులు, మనోభావాలు దెబ్బతీస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల ప్రతినిధులు తమ అభ్యంతరాలను, ఆందోళనను వివరించారు. వక్ఫ్ చట్టంలో మార్పులను అంగీకరించవద్దని, పార్లమెంట్ లో చట్టాన్ని వ్యతిరేకించాలని కోరుతూ ముఖ్యమంత్రికి వినతి పత్రం అందించారు. దీనిపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి ముస్లిం ప్రతినిధులకు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *