Breaking News

ఇంటర్నేషనల్ చెస్ పోటీల్లో 6/6 పాయింట్లతో పశ్చిమ బెంగాల్ కి చెందిన నీలాష్ సాహ 

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
బి.యన్.కె.యు. ఫౌండేషన్ వారు ఆర్గనైజర్ గా ఐకాన్ పబ్లిక్ స్కూల్ వారి సహకారంతో ప్రపంచ చదరంగ సమాఖ్య, అఖిల భారత చదరంగ సమాఖ్య, ఆంధ్ర చెస్ అసోసియేషన్ మరియు ది విజయవాడ చెస్ అసోసియేషన్ వారి సౌజన్యంతో 15 లక్షల నగదు బహుమతితో విజయవాడలోని ఐకాన్ పబ్లిక్ స్కూల్ వేదికగా జరుగుతున్న భారతీయ నవీన క్రీడ ఉత్సవ్ 1వ ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ చెస్ ఫెస్టివల్-2024 చదరంగ పోటీల్లో 6 రౌండ్లు పోటీలను ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ పొట్లూరి భాస్కరరావు, కువైట్ కి చెందిన బ్రిటిష్ కౌన్సిల్ ఇన్విజిలేటర్ ఫర్ ఐఈఎల్‌టిఎస్‌ దుగ్గిరాల హరిత, ఆంధ్ర చెస్ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె.వి జ్వాలాముఖి, ఐకాన్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ రాజేంద్ర తదితరులు టోర్నమెంట్ కన్వీనర్ షేక్ ఖాసిం మరియు టోర్నమెంట్ చీఫ్ ఆర్బిటర్ వసంత్ సమక్షంలో మొదటి ఎత్తు వేసి పోటీలను ప్రారంభించారు.

5/5 పాయింట్లు ఆరో రౌండ్లో ఇంటర్నేషనల్ మాస్టర్ శ్రీహరి (2372) తెల్లపావులతో మరియు ఇంటర్నేషనల్ మాస్టర్ నీలాష్ సాహా (2467) నల్లపావులతో పోటీపడగా దాదాపు నాలుగు గంటల పాటు ఆట కొనసాగింది. ఎట్టకేలకు ఇంటర్నేషనల్ మాస్టర్ నీలాష్ సాహా (2467) గెలిచారు. మొత్తం మీద ఆరు రౌండ్లు ముగిసేసరికి ఇంటర్నేషనల్ మాస్టర్ 6/6 పాయింట్లతో నీలాష్ సాహా (2467) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అలాగే తమిళనాడుకు చెందిన గ్రాండ్ మాస్టర్ గ్రాండ్ మాస్టర్ వెంకటేష్ ఎం.ఆర్, ఇంటర్నేషనల్ మాస్టర్ శర్వనన్ కృష్ణన్ , పశ్చిమ బెంగాల్ చెందిన ఇంటర్నేషనల్ మాస్టర్ కౌత్సవ్ కుండు 5.5/6 పాయింట్లతో కొనసాగుతున్నారని టోర్నమెంట్ కన్వీనర్ షేక్ ఖాసిం, డైరెక్టర్ విత్తనల కుమార్, ఇంటర్నేషనల్ ఆర్బిటర్ అమ్మినేని ఉదయ్ కుమార్ నాయుడు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *