Breaking News

రుయా ఆస్పత్రిలో మరింత మెరుగైన వైద్య సదుపాయాల కల్పనకు చర్యలు

-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి టి కృష్ణ బాబు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రుయా ఆస్పత్రిలో మరింత మెరుగైన వైద్య సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామని, వైద్యులు ఆస్పత్రికి వచ్చే పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు బాధ్యతగా అందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి టి. కృష్ణ బాబు పేర్కొన్నారు.

గురువారం మధ్యాహ్నం స్థానిక రుయా ఆస్పత్రి నందు వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సిఎస్ ఆకస్మిక తనిఖీ నిర్వహించగా వీరి వెంట జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులు ఉన్నారు. ముందుగా స్పెషల్ సిఎస్ ని పలువురు పారిశుద్ధ్య కార్మికులు కలిసి వారికి సక్రమంగా ఏజెన్సీ నుండి వేతనాల రావడంలేదని తెలుపగా సత్వర చర్యలకు ఆదేశించారు. ముందుగా అత్యవసర కేసుల రిజిస్ట్రేషన్ విభాగాన్ని, ఎక్స్ రే యూనిట్ ను పరిశీలించి రోజువారీగా ఎంతమంది చికిత్సకు వస్తున్నారని ఆరా తీశారు. అనంతరం ఎమర్జెన్సీ వార్డును తనిఖీ చేసి అందుతున్న సేవలను చికిత్స పొందుతున్న రోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు వివరిస్తూ క్యాజువాలిటీ వార్డు భవనం సరిపోవడం లేదని తెలిపారు. ఆపరేషన్ థియేటర్ నందు జరుగుతున్న సర్జరీల వివరాలను, ఆస్పత్రి సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. సర్జికల్ ఇంప్లాంట్స్, అత్యవసర మందులు ఉన్నాయా లేదా అని సర్జికల్ మెటీరియల్ తగినంత ఉందా అని ఆరా తీసి అవసరం మేరకు చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్ కు సూచించారు. అనంతరం ఓపి విభాగాన్ని ఈ – ఔషధి తదితర విభాగాలను తనిఖీ చేశారు. ఏ రోజుకు ఆ రోజే ల్యాబ్ రిపోర్టులను అందించేలా ఉండాలని అధికారులను ఆదేశించారు

ఈ సందర్భంగా స్పెషల్ సీఎస్ మీడియాతో మాట్లాడుతూ రుయా ఆస్పత్రి జిల్లాలోని పలు ప్రజలకు ఎంతో ముఖ్యమైనటువంటి ఆస్పత్రి అని, ఆస్పత్రిలో సదుపాయాలను ఏ విధంగా మెరుగుపరచాలి అనే అంశంపై సూపరింటెండెంట్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ తదితరులతో గత రెండు మూడు నెలలుగా దీనిపై దృష్టి సారించి మెరుగైన సేవలు అందించడానికి రూపకల్పన చేస్తున్నామని, అందులో భాగంగా ప్రస్తుతం ఏవిధంగా రుయా ఆస్పత్రిలో వైద్య సేవలు అందుతున్నాయని విషయంపై జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులతో కలిసి సెక్యూరిటీ అంశం, మందుల స్టాక్, సీసీ కెమెరాల ఏర్పాటు, సర్జికల్ పరికరాలు, సిబ్బంది ఏర్పాటు తదితరాల పరిశీలన చేస్తున్నామని, ఏమైనా లోపాలు ఉంటే సరి చేసుకునేలా ఆదేశాలు ఇస్తున్నామని తెలిపారు. 90 కోట్ల రూపాయల వరకు నిధులు మంజూరు చేయడం జరిగిందని, పీజీ సీట్లు పెంచుతున్న నేపథ్యంలో సదుపాయాల కల్పన ఏర్పాటు కొరకు సివిల్ కన్స్ట్రక్షన్ కొరకు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. పూర్తి అయిన వెంటనే మరింత మెరుగైన సేవలు అందించడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ఉదయం ఓ.పి, మధ్యాహ్నం 2 నుండి 4 గం.ల వరకు ఓ.పి లక్ష్యంతో సాయంత్రం కూడా ఒ.పి ప్రారంభించడం జరిగిందనీ, రోగులు మళ్ళీ రెండో రోజు రాకుండా అదే రోజు చికిత్స తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నామని, సంబంధిత ఫ్యాకల్టీ, సర్జికల్ సిబ్బంది తప్పకుండా ఆ సమయాల్లో అందుబాటులో ఉండే విధంగా పర్యవేక్షణ చేయడం జరుగుతోందని తెలిపారు. పేదలకు మెరుగైన వైద్య సేవలందించడానికి ఈ రోజు తనిఖీలు చేయడం జరిగిందని తెలిపారు

ఈ కార్యక్రమంలో రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్ రవి ప్రభు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీహరి, ఎస్వీ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ చంద్రశేఖరన్, ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్ పార్థసారథి తదితర వైద్య అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *