తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
పలు విద్యా సంబంధిత అంశాలపై విజయవాడ నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ సెక్రటరీ కోన శశిధర్ గారు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయ రామ రాజు, సమగ్ర శిక్ష ఎస్పిడి శ్రీనివాసరావు తదితర అధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వర్చువల్ విధానంలో సమీక్షించి దిశా నిర్దేశం చేయగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు అన్నింటిలో అపార్ (ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్టరీ) ఐడి జనరేట్ చేయడం అనే కొనసాగుతున్న కార్యక్రమం త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈనెల నవంబర్ 14న జరగనున్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కొరకు ముందస్తుగా చేపట్టాల్సిన కార్యాచరణపై ప్రోగ్రెస్ రిపోర్ట్ తయారీ, ఫార్మేటివ్ అసెస్మెంట్ వన్, టూ లకు సంబంధించిన ప్రోగ్రెస్ కార్డు తయారు చేసుకోవడం, విద్యార్థుల అవగాహన సామర్థ్యం ప్రగతి, విద్యా స్థాయి పురోగతిపై, పాఠశాల అభివృద్ధిపై సదరు సమావేశంలో చర్చించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు, పేరెంట్ టీచర్ లు పాల్గొని సదరు అంశాలను చర్చించాలి అని తెలిపారు. నవంబర్ లో మెగా డీఎస్సీ ప్రక్రియ కొనసాగుతుందని, దానికి సంబంధించిన ఖాళీల వివరాలను, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితర అంశాలను నిబంధనల మేరకు సిద్ధం చేసుకోవాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిబంధనల మేరకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా విద్యా శాఖ అధికారి వి.శేఖర్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News