Breaking News

సుందర పార్వతిపురం ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించిన మంత్రి

పార్వతీపురం, నేటి పత్రిక ప్రజావార్త :
సుందర పార్వతీపురం కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ మంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి శనివారం ప్రారంభించారు. సుందర పార్వతీపురం రూపొందాలని ఆమె ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వామ్యమై జిల్లా వ్యాప్తంగా పరిశుద్ధ వాతావరణం ఏర్పాటు చేయడంతో పాటు సుందరమైన ప్రకృతి సోయగల పరిసరాలను రూపకల్పనకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్, కురుపాం శాసన సభ్యులు తోయక జగదీశ్వరి, జాయింట్ కలెక్టర్ ఎస్ ఎస్ శోబిక, పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి జి కేశవ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *