-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజానీకానికి వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగ.. ప్రజల జీవితాల్లో కోటి ఆనందాల కాంతులు నింపాలని ఆకాంక్షించారు. ప్రతీ ఇంటి లోగిలి దీపకాంతులతో వెలుగులీనాలని.. నియోజకవర్గ ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని కోరుకున్నారు. ప్రజలు సుఖసంతోషాలతో జీవించేలా దీవించాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికి మంచి జరగలానే తపనతో పనిచేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయం నెరవేరేలా ఆయనకు మరింత శక్తిని ప్రసాదించాలని అమ్మవారిని వేడుకున్నారు. ప్రతిఒక్కరూ క్షేమకరంగా, పర్యావరణహితంగా దీపావళిని జరుపుకోవాలని.. ప్రకృతికి విఘాతం కలిగించని, కాలుష్య రహిత గ్రీన్ టపాసులనే కాల్చాలని తెలిపారు. సర్వమతాల వారు ఆనందంగా జరుపుకునే వేడుకలలో.. నియోజకవర్గ ప్రజలందరూ తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.