Breaking News

ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని అఖండ మెజార్టీతో గెలిపించాలి… : మోటూరి శంకర్ రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఏపీ స్టేట్‌ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ వెల్ఫేర్‌ ఆసోసియేషన్‌ అధ్యక్షులు మోటూరి శంకరరావు మాట్లాడుతూ కృష్ణా గుంటూరు పట్టబధ్రుల శాసనమండల అభ్యర్థిగా కూటమి ప్రభుత్వం బలపరిచిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.15 సంవత్సరాలు సర్వీస్ చేసిన ప్రతి మాజీ సైనికులు కూడా, శాసనమండలి ఎన్నికలకు ఓటు వేయడానికి అర్హుడు కావున, ప్రతి ఒక్క మాజీ సైనికులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. జీవో నెంబర్ 57– 2001 ప్రకారం మాజీ సైనికులు అందరూ తమ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ ప్రకారం ఓటు హక్కును వినియోగించుకుని కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా ని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆలపాటి రాజా ని గెలిపించుకోవడం ద్వారా మన మాజీ సైనికుల సమస్యలను పరిష్కరించుకునే వీలుంటుంది కావున మన సమస్యలు పరిష్కరించే మనిషిని మనం గెలిపించుకోవాలి అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే మాజీ సైనికులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయటం జరిగిందని, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సమావేశంలో వై. రమేష్ కుమార్ (మాజీ సైనికుల సంఘం ప్రధాన కార్యదర్శి), ముమ్మినేని గోపాలకృష్ణ (కృష్ణా జిల్లామాజీ సైనికుల సంఘం అధ్యక్షులు), ఐ. రత్న ప్రసాద్ (తెనాలి జిల్లా మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు), పాలేటి రాంబాబు (అఖిలభారత పూర్వ సైనిక సంఘం అధ్యక్షులు), తిరుపతిరావు, వి.ఆదినారాయణ సైనిక సంఘం సభ్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *