Breaking News

మద్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు మంచి భోజనం అందించడమే ప్రభుత్వ లక్ష్యం

-కోన శశిధర్, పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకానికి ప్రతి ఏటా రూ. 2,000 కోట్లు ఖర్చు చేస్తుందని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ అన్నారు. . మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో సోమవారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం (స్టాండర్డ్ డైజేషన్ ఆఫ్ మధ్యాహ్నం బడి భోజనం) మెనూ ప్రామాణికతపై ఒక రోజు నిర్వహించిన వర్క్ షాప్ ని పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కోన శశిధర్ మాట్లాడుతూ మధ్యాహ్న బడి భోజన పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ లు ఎంతో మంచి సంకల్పంతో రాష్ట్రంలో అమలు చేయాలని నిర్ణయించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న బడి భోజన పథకానికి ప్రతి ఏటా రూ. 2,000 కోట్లు ఖర్చు చేస్తుంటే.. ఇందులో కేంద్రం రూ. 400 కోట్లు ఇస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 1600 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. పిల్లలకు మధ్యాహ్న భోజనంలో మంచిగా ఆహార పదార్థాలు అందించాలనే విషయంపై అన్ని జిల్లాల మంచి మెనూ తీసుకునే విధంగా కసరత్తు చేస్తున్నామన్నారు.. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో వివిధ ఆహారపు అలవాట్లు ఉన్నాయన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో స్థానికంగా పండించే కూరగాయలను ఆహార పదార్థాలుగా అందించే మెనూలో చేర్చాలని సంకల్పించామన్నారు. పిల్లలకు బలవర్థకమైన ఆహారం అందినప్పుడే బాగా చదువుకుంటారని, అందించే ఆహారపు మెనూతోపాటు అందులో పోషక విలువలు ఎలా ఉన్నాయో చూడాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లలు ఏది ఇష్టపడతారో అవి వారికి అందుబాటులో వస్తే వారు ఇష్టంగా తీసుకుంటారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్థానికంగా దొరికే చింతపండు పులిహార లాంటి వాటి స్థానంలో గుమ్మడికాయతో మంచిగా తయారు చేసే ఆహార పదార్థాలను ఇష్టంగా తీసుకుంటారన్నారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో పిల్లలు బాయిల్డ్ కోడిగుడ్డు అంటే ఇష్టంగా తింటారని.. కొన్ని ప్రాంతాల్లో పిల్లలు వేయించిన కోడిగుడ్లు ఎక్కువగా తీసుకుంటారన్నారు. నేను రాష్ట్రంలోని మూడు ప్రాంతాలైన అనంతపురం, విజయనగరం, గుంటూరులలో జిల్లాల్లో కలెక్టర్ గా పనిచేసానన్నారు.. అనంతపురం జిల్లాలో వారు తీసుకున్న ఆహార పదార్థాలను కడప జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో తీసుకోరని, ప్రాంతాన్ని భట్టి ఆహారపు అలవాట్లు మారుతూ ఉంటాయన్నారు. రాయలసీమలో ఒక విధమైన ఆహారపు అలవాట్లు కోస్తాంధ్రలో ఒక విధమైన ఆహారపు అలవాట్లు ఉత్తరాంద్ర వారికి ఇంకో విధమైన ఆహారపు అలవాట్లు ఉన్నాయన్నారు.. అందరికీ ఆమోదయోగ్యమైన మెనూ అమలు చేస్తే పిల్లల పౌష్టికాహారానికి ఉపయోగపడి వారు బాగా చదువుకునే విధంగా తోడ్పడటంతోపాటు భావి భారత పౌరులుగా తయారవుతారన్నారు.. స్థానికంగా అందుబాటులో ఉండే కూరగాయలను ధృష్టిలో ఉంచుకొని మెనూ తయారుచేస్తే పిల్లలందరికీ ఇష్టమైన మెనూగా ఉంటుందన్నారు..
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ శాస్త్రవేత్త జె. శ్రీనివాస్ మాట్లాడుతూ విద్య, న్యూట్రిషన్ అనేవి విద్యార్థులకు చాలా ముఖ్యమైనవన్నారు. ఇవి నాణానికి రెండు వైపులా బొమ్మా, బొరుసు లాంటివన్నారు. 1960 సంవత్సరంలోని పిల్లలను స్కూల్స్ కు తీసుకురావడానికి మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకొచ్చారన్నారు. కమ్యూనిటీ లెవెల్లో మాల్ న్యూట్రిషన్ అనేది ఒక సమస్యగా ఉందన్నారు. వంట ప్రాక్టిస్ ను కొంచెం మార్చాల్సి ఉందని, ఎలా మార్పు చేసుకోవాలో ఆలోచించాల్సి ఉందన్నారు. పోషకాహార గ్యాప్ ను గమనించి చర్యలు తీసుకోవాలన్నారు.
ఫుడ్ ప్యూచర్ ఫౌండేషన్ సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ అగర్వాల్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మద్యాహ్న బడి భోజన పథకం పై కొత్తగా ఆలోచించి ముందుకు వెళ్లుతుందన్నారు. స్థానికంగా దొరికే కూరగాయలతో ఆహార పదార్థాల మెనూ తయారు చేయాలనే ఆలోచన మంచిదన్నారు. మధ్యాహ్న భోజన బడి పథకం పై మార్చిన మెనూతో ముందుకెళ్లాలనుకోవడంతో దేశంలోనే ఏపీ బెస్ట్ రాష్ట్రంగా ఉంటుందన్నారు.
గుంటూరు కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు మెనూ మార్పుపై జిల్లాలో వర్క్ షాపు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాల్లో 5 మండలాల్లో అక్షయ పాత్ర ద్వారా డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకానికి భోజనం అందిస్తున్నామన్నారు. స్థానికంగా దొరికే కూరగాయలతో మెనూ ను అందిస్తే పిల్లలు కూడా ఇష్టంగా తినే అవకాశం ఉందన్నారు. కలర్ రైస్ ను పిల్లలు అంత ఇష్టంగా తినడం లేదన్నారు. అయితే మామూలు వైట్ రైస్ లో పప్పులో ఏదైనా స్థానికంగా దొరికే ఆకు కూరలతో కలుపుకుని అన్నం తినడానికి ఇష్ట పడుతున్నారన్నారు. స్థానికంగా దొరికే గోంగూర లాంటి పదార్థాలను పిల్లలు ఆహార పదార్థంలో తినేందుకు బాగా ఇష్టపడుతారన్నారు.
ఇంటర్మీడియేట్ విద్యా కమిషనర్ కృతికా శుక్లా మాట్లాడుతూ డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకంలో భాగంగా పిల్లలకు మంచి నాణ్యతతో, న్యూట్రిషన్ తో భోజనం అందించేందుకు ప్రభుత్వం చూస్తుందన్నారు. ఏ జిల్లాల్లో పిల్లలు ఎలా స్థానికంగా ఆహార పదార్థాలను తీసుకుంటున్నారో పరిశీలిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర మూడు ప్రాంతాల్లో స్థానికంగా దొరికే కూరగాయలకు మెనూలో ప్రాముఖ్యం ఇవ్వాల్సి ఉందన్నారు. ముఖ్యంగా న్యూట్రిషన్ ఫుడ్ అందించడం ముఖ్యమన్నారు. గర్ల్ చైల్గ్ లో రక్తహీనత ఉంటుందని, ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ధృష్టి పెట్టిందన్నారు.
సమగ్ర శిక్షా ఎస్పీడీ, మధ్యాహ్న భోజన పథక డైరెక్టర్ బి.శ్రీనివాసరావు IAS., మాట్లాడుతూ… మధ్యాహ్న భోజనం విద్యార్థుల డ్రాపౌట్ రేటు తగ్గించడానికి ఉపయోగపడుతుందన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో పాఠశాల విద్య సెక్రటరీ కోన శశిధర్ ప్రత్యేకంగా మాట్లాడారని అన్నారు. మధ్యాహ్న భోజనం మెనూ మార్పునకు సంబంధించి అక్షయ పాత్ర, ఫుడ్ ప్యూచర్ ఫౌండేషన్, న్యూట్రిషన్ సైంటిస్టుల సంస్థల సలహాలు కూడా తీసుకోవడం జరుగుతుందన్నారు.
మధ్యాహ్నం భోజనం పథకం పై మార్చిన మెనూ కోసం ఎగ్జిబిషన్ స్టాల్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ జిల్లాల నుంచి మధ్యాహ్నం భోజనం వండే ఆయాలతో స్టాల్స్ లో ఆహార పదార్థాలను ఉంచడం జరిగింది. అందులో విద్యార్ధులకు అందించే మార్చిన మెనూ కోసం ఆహార పదార్ధాల నమూనా ను ప్రదర్శించారు. ఈ స్టాల్స్ ను పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఆధ్యంతం పూర్తిగా పరిశీలించి, వాటి రుచి చూసి వారికి కొన్ని సూచనలు చేయడం జరిగింది..
ఈ కార్యక్రమంలో ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ డా కె.లక్ష్మి, యూనిసెఫ్ న్యూట్రిషయన్ ఫీల్డ్ ఆఫీసర్ (హైదరాబాదు) రేషా దేశాయ్, డొక్కా సీతమ్మ గారి మునిమనవడు శ్రీ కామేశ్వరరావు, జాయింట్ ఫుడ్ కంట్రోలర్, (ఏపీ పుడ్ సేప్టీ) ఎన్. పూర్ణచంద్రరావు, మధ్యాహ్న భోజన పథక అడిషనల్ డైరెక్టర్ శ్రీమతి జి. గంగాభవానీ, సమగ్ర శిక్షా, పాఠశాల విద్యా శాఖ అధికారులు, ఆర్జేడీలు, డీఈవోలు, పాఠశాల కుక్ కమ్ హెల్పర్లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *