Breaking News

అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనపై కేటాయించిన విధుల్లో నిర్లక్ష్య వైఖరి కనబరచిన ఏఈ నాగవేణిని విధుల నుండి సస్పెండ్ చేసి ఈఎన్సీకి సిఫార్స్ చేయాలని ఎస్.ఈ.ని, ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యవైఖరి ప్రదర్శిస్తున్నారని స్థానికుల ఫిర్యాదు మేరకు బొంతపాడు (194 వార్డ్ సచివాలయం) శానిటేషన్ కార్యదర్శి బి.బోడెయ్యను విధుల నుండి సస్పెండ్ చేయాలని సిఎంఓహెచ్ ని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. మంగళవారం కమిషనర్ కెవిపి కాలనీ, అంకిరెడ్డిపాలెం, చౌడవరం, బుడంపాడు, బొంతపాడు ప్రాంతాల్లో అంగన్వాడీ సెంటర్లలో మౌళిక వసతుల ఏర్పాటు, సంజీవయ్య నగర్ గేటు దగ్గర త్రాగునీటి ప్రధాన పైప్ లైన్ ఇంటర్ కనెక్షన్, లీకులను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ తొలుత కెవిపి కాలనీ కెఎస్ఆర్టీ హైస్కూల్లోని అంగన్వాడీ కేంద్రంలో మరుగుదొడ్లు, నీటి సౌకర్య కల్పనపై నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసి సంబందిత ఏఈ నాగవేణిని విధుల నుండి సస్పెండ్ చేస్తూ ఈఎన్సీకి సిఫార్స్ చేయాలని ఎస్ఈని ఆదేశించారు. అంకిరెడ్డిపాలెంలోని అంగన్వాడీ కేంద్రంలో మరుగుదొడ్ల నిర్మాణం వెంటనే ప్రారంభించాలని, కేంద్రం పక్కనే స్థానికులకు అనువుగా లైబ్రరీ నిర్మాణానికి, ఎస్సీ కాలనీ శ్మశానంకు ప్రహరీ నిర్మాణంకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఏఈని ఆదేశించారు. అలాగే చౌడవరం, బుడంపాడు, బొంతపాడు ప్రాంతాల్లోని కేంద్రాల్లో కూడా పనులను ఈ నెల 15 నాటికి పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
బొంతపాడు 194 వార్డ్ సచివాలయం పరిధిలో శానిటేషన్ కార్యదర్శి బోడెయ్య ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం ఉంటున్నారని స్థానికుల ఫిర్యాదు మేరకు విధుల నుండి సస్పెండ్ చేయాలని సిఎంఓహెచ్ ని ఆదేశించారు.
శివనాగరాజు కాలనీ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి, ప్రతి రోజు వస్తున్న అవుట్ పేషెంట్ వివరాలను రిజిస్టర్ లో తనిఖీ చేసి, స్థానిక ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఆరోగ్య కేంద్రంలో అందించే సేవల గూర్చి వార్డ్ సచివాలయ కార్యదర్శుల ద్వారా స్థానిక ప్రజలకు అవగాహన కల్గించాలన్నారు.
అనంతరం సంజీవయ్య నగర్ రైల్వే గేటు దగ్గర పైప్ లైన్ లీకు, సుధీర్ఘ కాలం నుండి పెండింగ్ లో ఉన్న ఇంటర్ కనెక్షన్ పనులను పరిశీలించి, త్రాగునీటి సరఫరా పనులను యుద్దప్రాతిపదికన చేపట్టాలన్నారు. ఇంటర్ కనెక్షన్ పనుల జాప్యంపై ఇంజినీరింగ్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని, స్థానిక చర్చి పెద్దలతో చర్చించి, వారు అంగీకరించినందున చర్చి పక్కగా పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. పనులకు టెండర్ పొందిన కాంట్రాక్టర్ తో మాట్లాడుతూ ఇంటర్ కనెక్షన్ పనులు పూర్తి అయితే లీకుల సమస్య తీరడంతో పాటు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సమగ్రంగా నీటిని అందించడానికి వీలు కల్గుతుందని, పనులను వేగంగా చేపట్టాలని ఆదేశించారు.
పర్యటనలో ఈఈ సుందర్రామిరెడ్డి, డిఈఈలు సతీష్, కళ్యాణరావు, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

జూలై నాటికి గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు తరలిస్తాం.

-పోలవరం లెఫ్ట్ కెనాల్ పెండింగ్ పనులకు టెండర్లు పూర్తి. -ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ కు నిధుల కేటాయింపు -2027 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *