-గ్రామ,వార్డ్ సచివాలయాల సిబ్బంది కి పిలుపునిచ్చిన మంత్రి నాదెండ్ల మనోహర్
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈరోజు ఉదయం తెనాలి పట్టణంలోని శ్రీ రామ కృష్ణ కవి కళాక్షేత్రం నందు తెనాలి,కొల్లిపర మండలాల పరిధిలోని గ్రామ మరియు తెనాలి పట్టణ వార్డ్ సచివాలయాల సిబ్బందితో రివ్యూ మీటింగ్ జరిగింది. ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని, ప్రసంగించారు.
అభివృద్ధి సంక్షేమ లక్ష్యంగా పని చేద్దాం. కూటమి ప్రభుత్వం లో 99 శాతం మందికి ఒకటవ తేదీన పెన్షన్ అందజేస్తున్నాం సాధ్యం కాదు …కుదరదు అన్నారు… కానీ కూటమి ప్రభుత్వం చేసి చూపించింది. నాకు సంబంధం లేదు… నా పని కాదు అనుకోకుండా … నమ్మకంతో వచ్చిన ప్రజల వినతులను పరిష్కరించడానికి చొరవ చూపాలి. 2012లో కొల్లిపర మండలం మెగా గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది అని గుర్తు చేశారు. ప్రజల నుంచి వచ్చినా దాదాపు 2800 వినతులను 21 రోజులలో అధికారుల చొరవతో సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. మీరు స్ఫూర్తిని పొంది, మరింత ఎక్కువ మందికి ఉపయోగపడేలా పనిచేయాలి. 677 మంది గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది… కమిట్మెంట్ తో….. టీం స్పిరిట్ తో మన ప్రాంతాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలని లక్ష్యంతో పని చేయాలి. మంచి కమ్యూనికేషన్ తో సమస్య పరిష్కారం జరుగుతుంది. గ్రామస్థాయి వార్డు స్థాయిలో సమస్యల పరిష్కారానికి మన తెనాలి వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయడం జరిగింది. మన తెనాలి వాట్స్అప్ గ్రూప్లో వచ్చిన సమస్య పరిష్కారానికి 24 గంటల్లో అధికారులు స్పందిస్తూ మెసేజ్ వచ్చేలా చర్యలు చేపట్టడం జరిగింది. సిటిజన్ గవర్నెన్స్ విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా పనిచేయాల్సిందే. గత ప్రభుత్వంలో దాదాపు 3,000 మంది కౌలు రైతుల ఆత్మహత్య చేసుకున్నారు… వారికి జనసేన పార్టీ అండగా నిలబడింది. గత ప్రభుత్వంలో త్రీ మెన్ కమిటీ కౌలు రైతులని ఎందుకు ఆదుకోలేదు అనే ప్రశ్నకు సమాధానం లేదు. కూటమి ప్రభుత్వం కౌలుదారునికి రక్షణగా నిలిచింది. ఆర్జీల పరిష్కరించే విషయంలో ఆలస్యం కాకూడదు. ప్రభుత్వంలో పని చేసినప్పుడే ఉద్యోగిగా అనేకమందికి సహాయం చేయగలం. తెలుగు ప్రజలు గర్వపడే విధంగా పరిపాలన చేయాలని లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారు.. అత్యంత ప్రజాధరణ గల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనం స్ఫూర్తి పొంది… పదిమందికి ఉపయోగపడేలా పనిచేయాలన్నారు. అంతిమంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా కలిసి పని చేద్దామన్నారు.