-22వ డివిజన్‌లో ఎమ్మెల్యే గద్దె రామమోహన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అభివృద్థి, సంక్షేమాన్ని జత చేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాలన సాగిస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకుని తమకు భారీ మెజార్టీలను అందించారని, రాష్ట్ర ప్రజల అకాంక్షలను నెరవేర్చేవిధంగా కూటమి ప్రభుత్వం పాలన ఉంటుందన్నారు.
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 22వ డివిజన్ కృష్ణలంక దోభిఖానా దగ్గర రూ.13 లక్షల అంచనా వ్యయంతో రేకుల షెడ్డు నిర్మాణ పనులకు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ భూమి పూజ చేసి పనులను శనివారం ఉదయం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ విజయవాడ నగరానికి ఈ దోభిఖానా చాలా అవసరమైందని, రజకుల కోసం ఆనాడు పెద్ద స్థలాన్ని కేటాయించారన్నారు. అత్యాధునికమైన విధానాలను తీసుకువచ్చి అందరికి ఉపాధి కలిగించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. దోభిఖానాలో నీటి సౌకర్యం కల్పించడంతో పాటుగా దుస్తులు శుభ్రం చేసుకునేందుకు రేకుల షెడ్డు నిర్మాణం చేస్తున్నామని చెప్పారు. దోభిఖానా దగ్గర అపరిశుభ్రంగా చెట్లను తొలగించామని, రాత్రి వేళ కూడా ఇక్కడ వెలుగు ఉండేలా విద్యుత్ లైట్లను ఏర్పాటు చేయిస్తామని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్ళుగా పని చేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీయేనని చెప్పారు. అన్న నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలనే దేశం మొత్తం అమలు చేస్తున్నారని చెప్పారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరింత పదును పెట్టి సంక్షేమాన్ని జత చేసి మరింతగా ముందుకు వెళుతున్నారని చెప్పారు. గత ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో అభివృద్థి వెనక్కు వెళ్ళిందన్నారు. అందువల్లనే గత ఎన్నికల్లో ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేశారని చెప్పారు. ప్రజల అకాంక్షలకు తగినట్లుగా పనిచేసి వారి మన్ననలను కూటమి ప్రభుత్వం అందుకుంటుందని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు.
డివిజన్ పార్టీ అధ్యక్షులు పలిశెట్టి అన్నారావు మాట్లాడుతూ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ఈ డివిజన్‌లో లక్షల రూపాయలతో అభివృద్థి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. రూ.60 లక్షల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ పనులను ఇటీవలే డివిజన్‌లో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ప్రారంభించారన్నారు. ఇప్పుడు రూ.13 లక్షల వ్యయంతో రేకుల షెడ్డు నిర్మాణ పనులను ప్రారంభిస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఈ డివిజన్‌లో ఎన్నో అభివృద్థి పనులను ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ప్రారంభించారని అన్నారు. అవినీతిలేని ఎమ్మెల్యేల జాబితాలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ఐదో స్థానంలో ఉండటం తమకు చాలా గర్వకారణంగా ఉందన్నారు. నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్థి పథంలో పయనించేలా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చేస్తారని అన్నారు.
కార్పోరేటర్ ముమ్మనేని ప్రసాద్, నాయకులు తోట శ్రీను, నడికప్పుల శివ, మెరుపుల శివ, మెరుపుల సంజు, పెద్ది అన్నారావు, పెద్దపల్లి రాజు, నడికప్పుల రవి, కళ్ళపిల్ళ అప్పారావు, ఎం.మాధవి, పరుశురామ్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News