Breaking News

గ‌వ‌ర్న‌ర్ ఎస్.అబ్దుల్ న‌జీర్ ను క‌లిసిన ఏసీఏ అధ్య‌క్షుడు,ఎంపి కేశినేని శివ‌నాథ్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు, విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ శ‌నివారం గ‌వ‌ర్న‌ర్ బంగ్లాలో గ‌వ‌ర్న‌ర్ ఎస్.అబ్ధుల్ న‌జీర్ ను క‌లిశారు. ఏసీఏ త‌రుఫున గ‌వ‌ర్న‌ర్ ఎస్.అబ్ధుల్ న‌జీర్ కు విన‌తి ప‌త్రం అంద‌జేశారు. రాష్ట్రంలోని ప‌లు యూనివ‌ర్శిటీలో ఏసీఏ త‌రుఫున క్రికెట్ మైద‌నాల అభివృద్ధి కొర‌కు అనుమ‌తి ఇవ్వాల్సిందిగా విన‌తి ప‌త్రంలో కోర‌టం జ‌రిగింది. అలాగే ఏసీఏ రాష్ట్రంలో క్రికెట్ డెవ‌ల‌ప్మెంట్ కోసం ఏలాంటి చ‌ర్య‌లు తీసుకోనుంద‌నే విష‌యాలు ఏసీఏ అధ్య‌క్షుడు, ఎంపి కేశినేని శివ‌నాథ్ వివ‌రించారు. కేశినేని శివ‌నాథ్ అభ్య‌ర్ధ‌న పై గ‌వ‌ర్న‌ర్ ఎస్.అబ్దుల్ న‌జీర్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఏసీఏ సెక్ర‌ట‌రీ సానా స‌తీష్‌, కోశాధికారి దండ‌మూడి శ్రీనివాస్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

జర్నలిస్టుల హౌసింగ్ స్కీమ్‌పై సీఎం సానుకూలం : మంత్రి నారాయణ

-సీఆర్‌డీఏ కమిషనర్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శితో వెంటనే మాట్లాడుతా : నారాయణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *