Breaking News

జగన్ పై కూటమి నేతలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు… : పోతిన వెంకట మహేశ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పరిపాలన చేతగాక జగన్ పై కూటమి నేతలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విజయవాడ వైఎస్ఆర్సిపి నేత పోతిన వెంకట మహేశ్ మండిపడ్డారు. శనివారం గాంధీ నగర్ ప్రెస్ క్లబ్ లో కూటమి ప్రభుత్వ అరాచకాలపై పుస్తకాన్ని విడుదల చేసారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 5 నెలలలో అలజడులు అరాచకం అవినీతి ఆడపిల్లల మీద అఘాయిత్యాలు తప్ప ఏమి లేదన్నారు. ట్విట్టర్లో తప్ప పెట్టుబడులు రాష్ట్రంలోకి రావడం లేదన్నారు. బీసీలు డిమాండ్ చేస్తున్న కులగణనను కూటమి ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆరోపించారు. అన్ని వర్గాలను ఈ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతున్న ఒక్క మంత్రి మండల సమావేశం కూడా పెట్టలేదు అని మద్యం పాలసీకి మాత్రం మంత్రి మండల సమావేశాలు ఏర్పాటు చేసి మరీ చర్చలు పెడుతున్నారు అని అన్నారు.ఈ సమావేశంలో పలువురు వైసిపి నేతలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *