Breaking News

జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ ‘ఆర్చరీ’ లో ఆంధ్రప్రదేశ్ కు బంగారు పతకాలు

-బాలికల విభాగం లో ఆంధ్రప్రదేశ్ ఓవరాల్ ఛాంపియన్ షిప్
-విజేతలను అభినందించిన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామ్ రాజు IAS ,

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ ‘ఆర్చరీ’లో ఆంధ్రప్రదేశ్ అండర్ – 17 బాలురు మరియు బాలికల విభాగంలో బంగారు పతకాలు సాధించినట్లు రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ జి.భానుమూర్తి రాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న 68వ జాతీయ స్కూల్ గేమ్స్ ఈ నెల 11 నుండి 12 వరకు గుజరాత్ రాష్ట్రం “నడియాడ్”లో జరిగాయని తెలిపారు.
ఈ సందర్భంగా క్రీడాకారులను మరియు టీం కోచ్, మేనేజర్లను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ విజయ్ రామ రాజు IAS , గారు, సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS,  ప్రత్యేక అభినందనలు తెలిపారు.
‘ఆర్చరీ’ కాంపౌండ్ రౌండ్ బాలికల టీం విభాగం లో బంగారు పతక విజేతలు:
1) మాదల సూర్య హంసిని, 11 వ తరగతి భారతీయ విద్యా భవన్ పబ్లిక్ స్కూల్ విద్యాశ్రం, భీమవరం, పశ్చిమగోదావరి జిల్లా.
2) కర్రీ సుష్మిత, వెస్ట్ బెర్రీ హై స్కూల్, 12 వ తరగతి పెదఅమిరమం, కాళ్ళ మండలం,పశ్చిమ గోదావరి జిల్లా.
3) రిషి కీర్తన కామినేని, 10 వ తరగతి నారాయణ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరెన్సీ నగర్ విజయవాడ.
4) స్ఫూర్తి వేగేసిన, 10 వ తరగతి వెస్ట్ బెర్రీ హై స్కూల్, 12 వ తరగతి పెదఅమిరమం, కాళ్ళ మండలం ,పశ్చిమ గోదావరి జిల్లా.

‘ఆర్చరీ’ కాంపౌండ్ రౌండ్ బాలికల 1 వ మరియు 2 వ 50 మీటర్లు విభాగం మరియు వ్యక్తిగత ఓవరాల్ విభాగం లో బంగారు పతక విజేత:
మాదల సూర్య హంసిని, 11 వ తరగతి భారతీయ విద్యా భవన్ పబ్లిక్ స్కూల్ విద్యాశ్రం, భీమవరం పశ్చిమగోదావరి జిల్లా.
‘ఆర్చరీ’ రికర్వ్ రౌండ్ బాలుర -2వ 60 మీటర్లు విభాగం మరియు ఓవరాల్ వ్యక్తిగత విభాగం లో బంగారు పతక విజేత:
కోదండపాణి ధర్మేష్ జత్య , 11 వ తరగతి డాక్టర్ సి ఆర్ ఆర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ జూనియర్ కాలేజ్ సైదాపురం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా

Check Also

జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు పెంపు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని న్యాయశాఖ జ్యూడిషియల్ ఆఫీసర్ల( న్యాయాధికారులు ) పదవీ విరమణ వయసును పెంపు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *