అనకాపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ రహదారి 16వ నెంబర్ లోని రాజమహేంద్రవరం నుంచి అనకాపల్లి వరకు ఉన్న నాలుగు వరుసల రహదారిని ఆరు వరసల రహదారిగా, జాతీయ రహదారి 40 లోని రాయచోటి-కడప రహదారిలో నాలుగు వరసలుగా టన్నెల్ తో కూడిన రహదారి నిర్మాణానికి అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు కేంద్ర ప్రభుత్వానికి పంపించిన ప్రతిపాదనలు ఆమోదించడం జరిగిందని కేంద్ర రహదారుల, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లేఖ వ్రాశారని ఎం.పి. డాక్టర్ సి.ఎం.రమేష్ తెలిపారు.
జాతీయ రహదారి 16 పరిధిలోని అనకాపల్లి-అన్నవరం-దివాన్ చెరువు కి.మీ.741.255 నుంచి కి.మీ.903.000 సెక్షన్లో నాలుగు వరుసల రహదారిని ఆరు వరుసల రహదారిగా విస్తరింపజేయడానికి వివరణాత్మక ప్రాజెక్ట్ (DPR) ను సంబంధిత కన్సల్టెంట్ కు అందజేశారని, అదేవిధంగా జతీయ రహదారి 40లో రాయచోటి-కడప కి.మీ.211/500 నుంచి 217/200 సెక్షన్లో నలుగు వరుసల రహదారి టన్నెల్ నిర్మాణం 2024-24 సం. వార్షిక ప్రణాళికలో చేర్చబడిందని, టన్నెల్ నిర్మాణానికి అటవీ శాఖ అనుమతులు అవసరం ఉన్నందున, అటవీ శాఖ నుంచి అలైన్మెంట్ అనుమతులు వచ్చిన తరువాత టన్నెల్తో కూడిన నాలుగు వరుసల రహదారి నిర్మాణ ప్రతిపాదనలు చేపట్టడం జరుగుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన లేఖలో పేర్కొన్నారని ఎం.పీ. డక్టర్ సి.ఎం. రమేష్ తెలియజేశారు.
Tags amaravathi
Check Also
జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు పెంపు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని న్యాయశాఖ జ్యూడిషియల్ ఆఫీసర్ల( న్యాయాధికారులు ) పదవీ విరమణ వయసును పెంపు …