Breaking News

సంచార జాతులను ఎస్టీ జాబితాలో చేర్చాలని, అన్ని జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలి,.. : పెండ్ర వీరన్న

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సంచార జాతులను ఎస్టీ జాబితాలో చేర్చాలని, అన్ని జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని సంచార జాతుల సంఘం తీర్మానం చేసినట్లు ఆంధ్రప్రదేశ్‌ సంచార జాతుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పెండ్ర వీరన్న తెలిపారు. శుక్రవారం గాంధీనగర్‌లోని ఓ హోటల్‌లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాత్రికేయులతో పెండ్ర వీరన్న మాట్లాడుతూ ఈ సమావేశంలో పలు అంశాలు చర్చించి తీర్మానం చేయడం జరిగిందన్నారు. ఇందులో ప్రధానంగా 1961 ఆంధ్రప్రదేశ్‌ ట్రైబల్‌ ఎంక్వైరీ కమిటీ చైర్మన్‌ వెన్నెలగంటి రాఘవయ్య ఇచ్చిన కమిటీ రిపోర్ట్‌ ప్రకారంగా సంచార జాతులు ఎస్టీ జాబితాలో చేర్చాలని, 2008 జాతీయ సంచారజాతుల కమిషన్‌ చైర్మన్‌ బాలకృష్ణ రేణుక ఇచ్చిన రిపోర్టు ప్రకారంగా సంచార జాతులకు 10% విద్యా ఉద్యోగ రాజకీయ ఉపాధి రంగాల్లో రిజర్వేషన్‌ కల్పించాలని ఇచ్చిన రిపోర్టును అమలు చేసే విధంగా పోరాటం చేయాలని, సంఘం తీర్మానం చేసిందన్నారు. త్వరలో అన్ని జిల్లా కలెక్టర్లను కలిసి సంచార జాతులను ఎస్టీ జాబితాలో చేర్చాలని, కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చి వారి సమస్యల వివరించాలని ఆయన పిలుపునివ్వడం జరిగిందని, అలాగే త్వరలో అన్ని జిల్లాల్లో జిల్లా మహాసభలను ఏర్పాటు చేయాలన్నారు, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న జి.సుధాకర్‌ ఇటీవల వారి వ్యక్తిగత కారణాలవల్ల వారి పదవికి రాజీనామా చేయడం జరిగింది ఈ సందర్భంగా, ఇంతవరకు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న చల్లా రామయ్యని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రకటించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సంచార జాతుల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి అనపర్తి ఏడుకొండలు, రాష్ట్ర కార్యదర్శి అన్నప్పరెడ్డి వీర రాఘవులు, ముస్లిం సంచారజాతుల సంఘం నాయకులు షేక్‌ హేమావళీ, జిల్లా అధ్యక్షులు చుండూరు ముసలయ్య, వనపర్తి భీమన్న, చిన్న ఆంజనేయులు, యువజన విభాగం చిన్న కత్తుల మంగరాజు, పెండ్ర జాన్‌ మోషే, పాముల కుల సంఘ నాయకులు దాసరి వెంకటేశ్వరరావు, పిచ్చుకుంట్ల కుల సంఘ నాయకులు కత్తి కొండయ్య, మందుల కుల సంఘ నాయకులు పెండ్ర ముసలియ్య, వాడపల్లి నరసన్న, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *