మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), జిల్లా ఉపాధి కల్పన శాఖ, డి ఆర్ డి ఎ – సీడాప్ మరియు ఎస్.బి.ఎన్. ప్రభుత్వ జూనియర్ కళాశాల, పెడన సంయుక్త అద్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.18.11.2024 సోమవారం నాడు పెడన లోని ఎస్.బి.ఎన్. ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా వొకేషనల్ ఉపాధి కల్పన అధికారి సత్య బ్రహ్మం, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డాక్టర్ పి. నరేష్ కుమార్ మరియు పెడన ఎస్.బి.ఎన్. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రామారావు సంయుక్తంగా తెలియజేసారు.
ఈ జాబ్ మేళాలో, బంధన్ బ్యాంకు ప్రైవేట్ లిమిటెడ్, కె ఎల్ గ్రూప్, సంతోష్ ఆటోమోటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి ప్రముఖ కంపెనీల వారు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ కంపెనీ లలో గల ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ పూర్తిచేసిన 18 నుండి 30 సంవత్సరాల లోపు వారు అర్హులని, ఎంపిక అయిన వారికి నెలకు సుమారు రూ.14,000 నుండి రూ.20,000/- ల వరకు వేతనముతో పాటు ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు కలవు అని, నవంబర్ 18 న పెడన లో నిర్వహించబోయే జాబ్ మేళాకు హాజరయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సదరు ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు APSSDC సంస్థ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి dr పి.నరేష్ కుమార్ గారు తెలిపారు.
ఆసక్తి మరియు తగిన అర్హతలు గల అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.in/user-registration లింక్ నందు తమ పూర్తి వివరాలతో రిజిస్టర్ అయ్యి, సదరు జాబ్ మేళాకు రెజ్యూమె లతో లేదా బయోడేటా ఫోరమ్ లతో పాటు ఆధార్, పాన్ మరియు సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలతో రావాలని, మరిన్ని వివరాలకు 94404 44033 నంబర్ను సంప్రదించాలని తెలిపారు.
Prajavartha Online Telugu News