విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ శ్రీ శ్రీ భక్త కనకదాస 537 జయంతి మహోత్సవంలో కర్నూల్ లోని బీసీ భవన్ నందు కనకదాసు విగ్రహానికి జిల్లా కలెక్టర్ రంజిత్ భాష, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి వెంకటలక్ష్మమ్మ, కల్లూరు మండలం తాసిల్దార్ ఆంజనేయులు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బత్తిన వెంకటరాముడు కనకదాసు విగ్రహానికి పూలమాల వేసి స్మరించుకున్నారు. అనంతరం జిల్లా పరిషత్ కమిటీ హాల్ కనకదాస కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాష మాట్లాడుతూ కురువలకు ఆరాధ్య దైవమైన భక్త కనకదాసు గురించి మాట్లాడి, కురువలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని గవర్నమెంట్ నుండి వచ్చే ప్రతి పథకాన్ని మరియు MRGS ద్వారా ప్రతి ఊరిలో గొర్రెలకు నీటి కుంటలు ఉండేలాగా, గొర్రెలకి ఇన్సూరెన్స్ ఉచితంగా చేసేలాగా గవర్నమెంట్తో మాట్లాడుతానని, 50 సంవత్సరాలు పైబడ్డ గొర్రెల కాపరులకు పెన్షన్ అమలయ్యేలాగా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బత్తిన వెంకటరాముడు మాట్లాడుతూ భక్త కనకదాసు లాంటి అయనను స్ఫూర్తి గా తీసుకొని అతని లాగా యువత పట్టుదలతో ఉన్నంత స్థాయికి ఎదగాలని అలాగే కురవలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ సంగోళ్లి రాయన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తిన కిరణ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీపురం, డోన్ నియోజకవర్గం అధ్యక్షులు మధు, కురువ కార్పొరేషన్ డైరెక్టర్లు రామకృష్ణ, వెంకటరాముడు, ఉదయ్ కుమార్, ఉమ్మడి కర్నూలు జిల్లా గొర్రెల మేకల సహకార సంఘం చైర్మన్ కే శ్రీనివాసులు, డైరెక్టర్ ఎంకే మద్దిలేటి, చంద్ర మరియు పర్ల పెద్దమీన్ గారు, మాదాసి కురువ రాష్ట్ర అధ్యక్షులు తిరుమలేష్, మల్లికార్జున,పురుషోత్తం, యుగంధర్, చంద్రశేఖర్, బీసీ సంఘం నాయకులు బత్తుల లక్ష్మీనారాయణ, ధనుంజయ చారి తదితరులు సంఘం నాయకులు పాల్గొన్నారు.
Tags amaravathi
Check Also
జూలై నాటికి గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు తరలిస్తాం.
-పోలవరం లెఫ్ట్ కెనాల్ పెండింగ్ పనులకు టెండర్లు పూర్తి. -ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ కు నిధుల కేటాయింపు -2027 …