Tag Archives: AMARAVARTHI

ఇంటర్ విద్య అర్హతతో ఇండియన్ నేవీలో 742 పోస్టులకు.. దరఖాస్తు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ నేవీలో ఉద్యోగం చేయాలని కోరుకుంటున్న వారికి శుభవార్త. నౌకాదళం 741 ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఐటీఐ, డిప్లొమా, ఇంటర్ చదవినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ పరీక్షతో ఈ ఉద్యో గాలు భర్తీ చేయనున్నారు. గ్రూప్ బి, గ్రూప్ సి విభాగా ల్లో ఈ పోస్టులున్నాయి. ఈ నేవీ రిక్రూట్ మెంట్ కు ఎంపిక అయిన వారు చార్ట్ మ్యాన్, డ్రాఫ్ట్స్ మ్యాన్, ట్రేడ్ మ్యాన్ …

Read More »

గోదావరిలో గల్లంతైన యువకుడి కుటుంబానికి రూ.5 లక్షల సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గోదావరి నదిలో గల్లంతైన యువకుడి కుటుంబానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా, గంటిపెదపూడి వద్ద గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదంలో పి.గన్నవరంనకు చెందిన విజయ్ అనే యవకుడు గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న సీఎం..విజయ్ కుటుంబానికి రూ.5 లక్షలు సాయంగా ప్రకటించారు. నదిలో వరద ఉధృతి తగ్గేంత వరకు లంక గ్రామాల ప్రజలు, గోదావరి పరివాహక ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు.

Read More »

ట్రాక్టర్, ద్విచక్ర వాహనాలపై వరద బారిన పడిన లంకగ్రామాలలో పర్యటించిన కలెక్టర్ నాగరాణి

నరసాపురం, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమగోదావరి జిల్లాలో గోదావరి వరద ఉధృతికి ముంపుకు గురైన లంక గ్రామాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వయంగా పరిశీలించారు. ఆచంట మండలం అయోధ్య లంక, మర్రిమూల గ్రామానికి పడవపై చేరుకున్న పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ స్థానిక పరిస్థితులను తెలుసుకున్నారు. నీట మునిగిన లంక గ్రామాలకు ద్విచక్ర వాహనం, ట్రాక్టర్ మీద ప్రయాణిస్తూ లంక గ్రామ వాసులకు భరోసానందించారు. ఎస్సీ, బీసీ, మత్స్యకార కాలనీల్లో కలయ తిరుగుతూ ప్రతి కుటుంబం యొక్క యోగక్షేమాలను కలెక్టర్ చదలవాడ నాగరాణి …

Read More »

రామయ్య సాహసమే ఉద్యోగులకు స్పూర్తి – మంత్రి గొట్టిపాటి రవి కుమార్

-లైన్ మెన్ రామయ్యను అభినందించిన మంత్రి గొట్టిపాటి రవి కుమార్ -వరద ఉద్ధృతిని లెక్క చేయకుండా తీగలపై నడిచి విద్యుత్ పునరుద్ధరించిన రామయ్య -రామయ్య సాహసం ఇతర ఉద్యోగులకు ఆదర్శనీయమని మంత్రి కితాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సంక్షోభం నుంచి అవకాశాలు అందిపుచ్చుకోవడం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నుంచి నేర్చుకున్నామని విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. ఇందుకు లైన్ మెన్ రామయ్య చేసిన సాహసమే ప్రత్యక్ష ఉదాహరణ అని ఆయన కొనియాడారు. ప్రజావసరాలను …

Read More »

స్ఫూర్తిప్రదాతల పేర్లతో ప్రభుత్వ పథకాలఅమలు హర్షణీయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భావి తరాలకు స్ఫూర్తిని అందించే సమాజ సేవకులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాలను అమలు చేయడం హర్షణీయం అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖలో పథకాలను డా.సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ, అబ్దుల్ కలాం పేర్లతో అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కి అభినందనలు. గత ప్రభుత్వ పాలనలో అన్ని పథకాలకు …

Read More »

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు… అర్జీల పరిష్కారంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 

-వెంకటగిరిలో మహిళలను, వృద్ధులను వేధిస్తున్న ముఠాలపై వచ్చిన ఫిర్యాదుకు స్పందించి తిరుపతి ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన పవన్ కళ్యాణ్  గంటల వ్యవధిలో స్పందించిన పోలీసు యంత్రాంగం… కేసులు నమోదు చేసి బైండోవర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్- తన కార్యాలయానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను, ఫిర్యాదులను శనివారం ఉదయం నుంచీ పరిశీలిస్తున్నారు. తన కార్యాలయ సిబ్బందితో కలసి ఉప ముఖ్యమంత్రి స్వయంగా ప్రతి అర్జీని క్షుణ్ణంగా చదువుతున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా, …

Read More »

ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేది 03.08.2024

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధ్యాయ అర్హత పరీక్షకు జూలై నెల రెండవ తారీఖున నోటిఫికేషన్ వెలువడింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఆగస్టు నెల మూడో తేదీ తో ముగియనుంది. దరఖాస్తు చేసుకోవడానికి ముగింపు తేదీని పొడిగించడం జరగదని, అర్హత కలిగిన అభ్యర్థులు గడువు తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఇంతవరకు టెట్ పరీక్షకు 3,20,333 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆన్లైన్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలు అక్టోబర్ నెల 3 వ తేదీ నుండి 20 వ …

Read More »

మానవ అక్రమ రవాణాను నిరోధించేందుకు అందరూ కలసికట్టుగా కృషి చేయాలి – సీ.ఐ.డీ ఎస్పీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు భాద్యతగా ముందుకు రావాలని, సమిష్టిగా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు (ఎ.హెచ్.టి.యు), మహిళా సంరక్షణ విభాగం-సీఐడీ ఎస్పీ కేజీవీ సరిత పిలుపునిచ్చారు. ప్రపంచంలో మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణా తర్వాత మానవ అక్రమ రవాణా మూడో అతిపెద్ద వ్యవస్థీకృత నేరంగా మారిందని ఆమె అన్నారు. 30 జూలై 2024న జరుపుకోబోతున్న ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక …

Read More »

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడిక‌ల్ ఆఫీస‌ర్ల‌తో శ‌నివారం వీడియో కాన్ఫ‌రెన్స్

మంగ‌ళ‌గిరి, నేటి పత్రిక ప్రజావార్త : మంగ‌ళ‌గిరి ఎపిఐఐసి ట‌వ‌ర్స్ లోని వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌ధాన కార్యాల‌యం నుండి శనివారం ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ క‌మీష‌న‌ర్ సి.హ‌రికిర‌ణ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వైద్య ఆరోగ్య‌శాఖాధికారులు, ఆసుప‌త్రుల సేవ‌ల జిల్లా స‌మ‌న్వ‌యాధికారులు, జిల్లా, ప్రాంతీయ‌, సామాజిక ఆసుప‌త్రుల సూప‌రింటెండెంట్‌లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడిక‌ల్ ఆఫీస‌ర్ల‌తో శ‌నివారం వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. జూన్ నుండి రాష్ట్ర‌వ్యాప్తంగా వ‌ర్షాలు కురుస్తున్నందున కీట‌క జ‌నిత వ్యాధులు ప్ర‌బ‌ల‌డం, నీరు క‌లుషితం కావ‌డం, ప‌రిశుభ్ర‌త వంటి అంశాల‌పై …

Read More »

భారీ వర్షాలకు, వ‌ర‌ద‌ల‌కు దెబ్బ‌తిన్న ప్ర‌తి రైతును ఆదుకుంటాం

-ఇళ్లు నీట మునిగిన ప్ర‌తి కుటుంబానికి రూ.3 వేల త‌క్ష‌ణ సాయం -1.06 ల‌క్ష‌ల ఎక‌రాల్లో వరి పంట నీటి మునిగింది -నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటాం -శాసన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : వ‌ర‌ద‌ల‌కు దెబ్బ‌తిన్న ప్ర‌తి రైతునూ త‌మ ప్ర‌భుత్వం ఆదుకుంటుంద‌ని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తెలిపారు. శాస‌న‌స‌భ‌లో శుక్ర‌వారం ఆయ‌న మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటీవ‌ల కురిసిన భారీ వర్షాలకు, వ‌ర‌ద‌ల‌కు న‌ష్ట‌పోయిన ప్ర‌జ‌ల‌ను, రైతుల‌ను త‌మ ప్ర‌భుత్వం అన్నివిధాలా ఆదుకుంటుంద‌ని …

Read More »