సాంఘిక సంక్షేమ వసతి గృహాల మరమ్మతులకు రూ.378 లక్షలు నిధికి మంజూరు

-24 సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో మరమ్మత్తులు చేపట్టనున్న ఇంజనీరింగ్ అధికారులు
-మార్చి మొదటి వారంలో ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ ద్వారా పనులు పూర్తి చెయ్యడం పై ఆదేశాలు జారీ
-జిల్లా కలెక్టరు పి. ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ వసతి గృహాల మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.378.05 లక్షలు నిధులు మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియచేసారు.

తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న 24 సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో మెరుగైన సౌక్యరం, మౌలిక సదుపాయాలు కల్పించుటకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ నిధులతో పైకప్పు మరమ్మతులు, ఫ్లోరింగ్ మరమ్మతులు, త్రాగునీరు, మరుగు దోడ్లు, కరెంటు పనులు, తలుపులకు మరియు కిటికిలకు దొమలు నివారణకు మేష్ లు, బాలికల వసతి గృహాములకు ప్రహారి గోడ నిర్మణాము పనులు మరియు తక్షణ అవసర మరమ్మతులు చేటారిఫ్పట్టనున్నట్లు కలక్టర్ తెలియ చేశారు.

గోపాలపురం నియోజక వర్గ పరిధిలోని 10 ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాములకు రూ.144.84 లక్షలు , రాజమహేంద్రవరం సిటీ నియోజక వర్గ పరిధిలోని 6 ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాములు రూ.70.01 లక్షలు , రాజమహేంద్రవరం రూరల్ నియోజక వర్గ పరిధిలోని 2 ప్రభుత్వ సంక్షేమ వసతి గృహములు లకు రూ.32.51 లక్షలు , జగ్గంపేట నియోజక వర్గ పరిధిలోని గోకవరం మండలం లోని 1 ప్రభుత్వ సంక్షేమ వసతి గృహము నకు రూ.17.05 లక్షలు , రాజానగరం నియోజక వర్గ పరిధిలోని 1 ప్రభుత్వ సంక్షేమ వసతి గృహము రూ.11.05 లు, పెద్దాపురం నియోజక వర్గ పరిధిలోని రంగంపేటలోని 1 సంక్షేమ వసతి గృహము రూ.11.29 లక్షలు, కోవ్వూరు నియోజక వర్గ పరిధిలోని 2 ప్రభుత్వ సంక్షేమ వసతి గృహములకు రూ.52.53 లక్షలు , నిడదవోలు నియోజక వర్గ పరిధిలోని 3 ప్రభుత్వ వసతి గృహములకు రూ.38.32 లక్షలు. వసతి గృహాము పనులు పర్యవేక్షించుటకు ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ , ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖలకు పై పనులు నిర్వహణ బాధ్యత ను అప్పంగించడం జరిగిందన్నారు. పై పనులను 2025 మార్చి మొదటి వారం లోగా పూర్తి చేయాలని అధికారులకు లక్ష్యం నిర్దేశించినట్లు కలక్టర్ తెలియ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ స్థాయిలోనూ విపత్తు నిర్వహణ బృందాల ఏర్పాటు

-అమిత్ షా గారి సూచనలతో అత్యవసర సమయంలో స్పందించేలా శిక్షణ -జాతీయ విపత్తు నిర్వహణ బృందాలతో సమన్వయం చేసుకుంటాం -సమష్టిగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *