అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజంలోని ప్రతి ఒక్కరూ మన రాజ్యాంగ స్పూర్తికి అనుగుణంగా నడుచుకోవాలని అప్పుడే రాజ్యాంగ నిర్మాతల కలలు సాకారం అవుతాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ పేర్కొన్నారు.76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాకు వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని జాతిపిత మహాత్మా గాంధి,రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించిన పిదప మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్క రించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనదని నాటి రాజ్యాంగ నిర్మాతలు ఎంతో ముందు చూపుతో దేశంలోని పౌరులందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు,ఆర్ధిక అసమానతలను తొలిగించేందుకు అన్ని అంశాలను పొందుపర్చి ఒక గొప్ప రాజ్యాంగాన్ని మనకు అందించారని గుర్తు చేశారు.కావున రాజ్యాంగ నిర్మాతల ఆశయాలకు అనుగుణంగా మెలుగుతూ ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్పూర్తిని కాపాడేందుకు కృషి చేయాలని సిఎస్ విజయానంద్ సూచించారు.
వికసిత్ భారత్ లో భాగంగా స్వర్ణాంధ్ర 2047 నాటికి రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా చేసేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున ప్రణాళికలు అమలు చేస్తోందని ఆయా లక్ష్యాల సాధనకు ప్రభుత్వ యంత్రాంగమంతా కృషి చేయాల్సిన అవసరం ఉందని సిఎస్ విజయానంద్ స్పష్టం చేశారు.ప్రతి ఉద్యోగి,అధికారి చిత్తశుద్ధితో పనిచేసి ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి సంక్షేమ పధకాలను అర్హులైన ప్రతి పేదవారికి సక్రమంగా చేరే విధంగా పని చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.అనంతరం చిన్నారులకు సిఎస్ విజయానంద్ మిఠాయిలు పంపిణీ చేశారు.
ఈకార్యక్రమంలో సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా, అదనపు కార్యదర్శి కాళీ కుమార్,సిఎస్ఓ మల్లికార్జున,పలువురు సచివాలయ అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
Tags amaravathi
Check Also
పిజిఆర్ఎస్ ఆర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కారానికి చర్యలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థలో చేపట్టే డయల్ …