విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ గౌడ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి మర్యాదపూర్వకంగా ఎంపి కేశినేని శివనాథ్ కలిశారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో శుక్రవారం ఎంపి కేశినేని శివనాథ్ ను కలిసి చిత్రపటం బహుకరించారు. గౌడ కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమితులైనందుకు వీరంకి వెంకట గురుమూర్తికి ఎంపి కేశినేని శివనాథ్ అభినందనలు తెలుపుతూ శాలువాతో సత్కరించారు. కార్యకర్త స్థాయి నుంచి టిడిపి స్టేట్ బీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి గా వుంటూ పార్టీ అభివృద్దికి విశేష కృషి చేసిన వీరంకి ఈ పదవికి అర్హుడని కొనియాడారు. రాష్ట్రంలో బిసిలకు తెలుగు దేశం పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. అటు పార్టీకి ఇటు ప్రజలకి మరింత సేవ చేసి రాజకీయంగా మరింత ఉన్నత పదవులు అందుకోవాలని ఆకాంక్షించారు. తనకి అభినందనలు తెలిపిన ఎంపి కేశినేని శివనాథ్ కు వీరంకి వెంకట గురుమూర్తి కృతజ్ఞతలు తెలిపారు.
Prajavartha Online Telugu News