Breaking News

పారిశుద్ధ్య నిర్వహణలో డ్రోన్ సర్వేలెన్సు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న డ్రోన్ సర్వేలెన్సులో భాగంగా శనివారం నాడు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పారిశుధ్య సిబ్బందితో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రతి సచివాలయం పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపరిచేందుకు డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా సర్వే నిర్వహిస్తున్న నేపథ్యంలో, సర్వే ద్వారా గమనించిన వ్యర్థాలను తొలగించుటకు 286 సచివాలయ సానిటరీ సెక్రటరీలతో సమావేశంలో డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా పారిశుద్ధ్య నిర్వహణలో మెరుగు ఎలా పరచాలి, వ్యర్ధాలను ఎంత త్వరగా తొలగించాలి సెక్రటరీలు, సానిటరీ ఇన్స్పెక్టర్ల సమన్వయం ఎలా ఉండాలి లాంటి అంశాలపై చర్చించారు.

డ్రోన్ల పర్యవేక్షణ ద్వారా పారిశుధ్య నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ డ్రోన్ గమనించిన వ్యర్థాలను, డ్రోన్ పర్యవేక్షణ బృందం వెంటనే సెక్రటరీలకు తెలియపరచాలని, సంబంధిత సచివాలయం సిబ్బంది వెంటనే స్పందించి ఆ వ్యర్థాలను తొలగించాలని, సమన్వయంతో పనిచేస్తే పారిశుద్ధ్య నిర్వాహనను మెరుగుపరచవచని అన్నారు. ప్రజలకు దోమల ఇబ్బంది కలగకుండా, వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ నగర అభివృద్ధికి అందరూ కృషి చేయాలి అన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు డాక్టర్ రామకోటేశ్వరరావు, డాక్టర్ బాబు శ్రీనివాసరావు, డ్రోన్ పర్యవేక్షణ బృందం, సానిటరీ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, సెక్రటరీలు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *