-సిఎంఆర్ఎఫ్ పథకాన్ని ఉపయోగించుకోండి వైద్య ఖర్చుల అప్పులను తీర్చుకోండి
-15వ డివిజన్ లో సిఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ.3 లక్షల విలువచేసే చెక్కులను అందజేసిన తూర్పు -నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్
-సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆదివారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 15 వ డివిజన్ లో సీఎంఆర్ ఎఫ్ ద్వారా మంజూరైన సుమారు రూ.3 లక్షల చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే గద్దె రామ మోహన్ స్వయంగా అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ మోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంఅధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన సంక్షేమ పథకాలు గురించి తెలుగుదేశం,జనసేన, బీజెపి నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలని చెప్పారు. ఎన్నికలలో ఇచ్చిన హామీల ను ఇప్పటికే చాలా భాగం అమలు చేస్తున్నామని అన్నారు. కూటమిప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లను రూ.4000 పెంచడమే కాకుండా రెండు నెలల బకాయిలను కూడా అందజేశామని చెప్పారు. ప్రతినెల లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఫించన్లు అందజేస్తున్నామని చెప్పారు. ఎన్నికల్లో చెప్పినట్లుగానే ప్రతి మహిళకు మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చే పథకాన్ని కూడా ప్రారంభించామని అన్నారు. రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధి ప్రజారోగ్యం ఇలా అన్ని విషయాలలో ముందుండేలా చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నీ విధాలుగా కష్టపడుతున్నారని అన్నారు. రాష్ట్రంలోని పేద ప్రజలకు అండగా ఉండాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నిధులకు ఏమాత్రం వెనుకాడకుండా పేదల వైద్య ఖర్చులను సిఎంఆర్ఎఫ్ ద్వారా అందజేస్తున్నారని అన్నారు. 2014 -19 సంవత్సరాల మధ్య కాలంలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వేల కోట్ల రూపాయలను ప్రజలకు వైద్య చికిత్సల నిమిత్తం అందజేశారని చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఐదు నెలల కాలంలోనే తూర్పు నియోజకవర్గంలో 46 మందికి కోటి రూపాయలను పైగా అందజేశామని అన్నారు. తమ ప్రభుత్వము ఇప్పుడు రోజుకు సుమారు రూ.5 లక్షల చొప్పున ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పేదలకు అందచేస్తున్నామని వివరించారు. కూటమి ప్రభుత్వం లోని పార్టీలోని నాయకులు సీఎంఆర్ఎఫ్ పథకం గురించి ప్రతి ఇంటికి వెళ్లి వివరించి అర్హులైన వారిని ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేలా చూడాలని చెప్పారు. వైద్య ఖర్చులకోసం చేసిన అప్పులను ఈ పథకం ద్వారా దరఖాస్తు చేసుకొని మంజూరైన నిధులతో ఆ అప్పులను తీర్చుకోవాలని చెప్పారు. పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నిధులు మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భరోసా కల్పిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం గురించి నాయకులు విస్తృతంగా ప్రచారం చేయాలని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీల కంటె తెలుగుదేశం పార్టీ ఒకటి ప్రజాస్వామ్యయుతంగా సభ్యత్వ నమోదు నిర్వహించడం తోపాటు పార్టీ నాయకులను కూడా ఎన్నుకునే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక్కటేనని చెప్పారు. డివిజన్ స్థాయి నుంచి పార్టీ అగ్ర నాయకత్వం వరకు ప్రజాస్వామ్యతంగా మే నెలలో జరిగే మహానాడులో ఎన్నుకుంటామని అన్నారు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను చూసి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సభ్యత్వాలను తీసుకుంటున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్, గాదిరెడ్డి అమ్ములు , పఠాన్ హయత్ ఖాన్, చిన్నం ఈశ్వర రావు , కొల్లి శేషు, సత్తు శ్రీను, నిమ్మల హేమ, సింగంశెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News