Breaking News

ఎం స్ ఎం ఈ సర్వే ప్రక్రియను వేగవంతం చెయ్యాలి…

-జిల్లా కలెక్టర్ , Dr .లక్ష్మీషా, జి.IAS,

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్యం పరిశ్రమశాఖ ద్వారా జారీ చేసిన ఉత్తర్వులు మేరకు జిల్లాలో MSME సర్వే ప్రక్రియను వేగవంతం చెయ్యాలని జిల్లా కలెక్టర్ Dr .లక్ష్మీషా, ఆదేశించారు . బుధవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ ద్వారా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ బి.సాంబయ్య మరియు ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ తో కలసి ఎంపీడీవోలు , మున్సిపల్ కమిషనర్లు , గ్గ్రామా వార్డ్ సచివాలయాలు సిబ్బంది తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి MSME సర్వేనిర్వహించడంలో మొబైల్ యాప్ ద్వారా వివరాలు నమోదు వాటి విధి విధానాలు ఫై పలు సూచలను ఆదేశాలు జారీ చేశారు . ఈ సందర్భముగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా MSME సర్వే-2024 ను తిరిగి ప్రారంభించడం జరిగిందని , అందువల్ల అన్ని MSME లు(పరిశ్రమలు సేవా రంగాలు, వ్యాపార సంస్థలు) ” ఉద్యం” రిజిస్ట్రేషన్ లో నమోదు కావాలని తెలిపారు.
ముఖ్యంగా క్షేత్రస్థాయిలో సర్వేలో భాగం గా డివిజన్ స్థాయిలో ని Trade అస్సోసియేషన్లను భాగస్వామ్యం చేసి అవగాహనా సమావేశాలు నిర్వహించాలన్నారు. ఈ విషయం లో ఏమయినా సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేసుకొనేందుకు పరిశ్రమల శాఖ అధికారులు మరియు కమర్షియల్ టాక్స్ శాఖ తో సమన్వయము చేసుకోవాలని ఆదేశించారు. పోటీతత్వ పారిశ్రామిక ఆర్ధిక వ్యవస్థను పెంపొందించుకోవడానికి ఈ సర్వే ఎంతగానో ఉపయోగపడుందన్నారు . ప్రస్తుతం ప్రభుత్వం పరిశ్రమ అవసరాలపై స్పష్టమయిన ఆవగాహన పొందటానికి MSME యూనిట్లలో సాంకేతిక ఉత్పత్తి మరియు నిర్వహణ నైపుణ్యాలలో గల కారణాలను గుర్తించడానికి ఈ సర్వే ప్రక్రియను లక్యంగా పెట్టుకున్నదని కలెక్టర్ తెలిపారు. వ్యాపార కార్యకలాపాల అన్ని వివరాలు సర్వే యాప్ లో పొందుపర్చడం వల్ల దేశ , రాష్ట్ర ఆర్ధికాభివృధిని తెలుసుకొనుటకు ఆవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు . ముఖ్యంగా సచివాలయాలు పరిధిలోని సిబ్బంది అందరు MSME సర్వేలో పాల్గొనుటకు ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్ ఆదేశించారు . ఈ కార్యక్రమములో గ్గ్రామా వార్డు సచివాలయ నోడల్ అధికారి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *