Breaking News

‘యువ ఉత్సవ్ ‘ యువత ప్రతిభకు చక్కని వేదిక

-దేశభక్తి పెంపునకు ఇలాంటి కార్యక్రమాలు అవసరం
-జిల్లా యువత జాతీయ స్థాయిలో రాణించాలి
-యువతరానికి TTD బోర్డు సభ్యులు శ్రీ జి.భాను ప్రకాష్ ఉద్బోధ
-ఉత్సాహంగా… ఉల్లాసంగా “యువ ఉత్సవ్”
-నెహ్రూ యువ కేంద్ర కార్యక్రమాలపై ప్రశంసలు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
యువ ఉత్సవ్ లాంటి కార్యక్రమాలు నేటి యువతరానికి స్ఫూర్తిదాయకంగా ఉండడంతోపాటు వారిలోని ప్రతిభా పాటవాలను వెలికి తీసేందుకు, దేశభక్తిని పెంపొందించేందుకు ఉపయోగపడతాయని జిల్లా యువజన అధికారి టీటీడీ బోర్డు గౌరవ సభ్యులు జి భాను ప్రకాష్ రెడ్డి అన్నారు. యువతరం సానుకూల దృక్పథంతో ఈ పోటీ ప్రపంచంలో రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆయన ప్రసంగిస్తూ జీవితంలో ఎదురయ్యే గెలుపోటములను సమానంగా స్వీకరించాలని యువతకు ఉద్బోధించారు. భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ ,నెహ్రూ యువ కేంద్ర , చిత్తూరు ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువ ఉత్సవ్ కార్యక్రమం శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం లో శుక్రవారం నిర్వహించారు.
ఈ యువ ఉత్సవ్ లో వచ్చిన అవకాశాన్ని యువతి ,యువకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా యువజన అధికారి బి ప్రదీప్ కుమార్ సూచించారు. ఉరకలెత్తే ఉత్సాహం చూపించే యువతను చూస్తే తమ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయన్నారు. తిరుపతి జిల్లా యువత రాష్ట్ర, జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటాలన్నారు. SPMVV డీన్ డాక్టర్ కాత్యాయని గారూ మాట్లాడుతూ స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత తాము అనుకున్న లక్ష్యాలను సాధించాలని హితవు పలికారు. యువ ఉత్సవంలో భాగంగా మిల్లెట్స్, ఇతర స్టాళ్లను ఏర్పాటు చేశారు.
నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువ అధికారి జి. జ్ఞానశేఖర్ రెడ్డి మాట్లాడుతూ యువ ఉత్సవ్ లో భాగంగా ఇండియా @2047 నాటికీ దేశం ప్రపంచానికి దిక్సూచి లా ఉండాలన్నారు. అందుకు ఇలాంటి కార్యక్రమాలు మరింత దోహదపడతాయన్నారు.అనంతరం కల్చరల్ కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ శైలేశ్వరి మాట్లాడుతూ
ప్రజలలో మన దేశం విభిన్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వం గురించి ప్రశంసలను సృష్టించడం చేయవచ్చని తెలిపారు. సెట్వెన్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి కే మోహన్ మాట్లాడుతూ
భారతదేశం ఇటీవల సంవత్సరాలలో వివిధ రంగాలలో సాధించిన ముఖ్యమైన పురోగతిని ప్రదర్శించడానికి యువ ఉత్సవాలు లాంటి కార్యక్రమాలు చక్కని వేదిక అన్నారు. నెహ్రూ యువ కేంద్రం వారికి ఈ యువ ఉత్సవ్‌లో ప్రతిభావంతులైన యువత విస్తృత స్థాయిలో నిమగ్నమై ఉన్నారని నిర్ధారించడానికి, పెయింటింగ్ లో 60 మంది పద్యాలు 5 మంది ప్రసంగం కు 20 మంది ఫోటోగ్రఫీ కు 50 మంది జానపద/సాంప్రదాయ కళలు 15 టీంలూ పాల్గొన్నందుకు సంతోషకరమన్నారు. అలాగే యూత్ క్లబ్ సభ్యుల కోసం ఫోరమ్ వంటి ప్రతిభను చేర్చడానికి ఈ కార్యక్రమంలో భాగంగా చేయబడటం పట్ల హర్షం వ్యక్తంచేశారు. మన జిల్లా యువతీ యువకులు అత్యద్భుత ప్రతిభను ప్రదర్శించి జాతీయస్థాయిలో రాణించాలని జిల్లా గణాంకాధికరి ఎం సి బాబు రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన యువత, SPMVV కళాశాల యువతీ యువకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *