భారీ వర్షాలకు అధికారులను అప్రమత్తం చేసిన ఆర్డిఓ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాగల 5 రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని బందర్ ఆర్ డి ఓ ఎన్ ఎస్ కే ఖాజావలి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆర్ డి ఓ బందర్ డివిజన్లోని అన్ని మండల తాసిల్దార్ లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, డీఎస్పీలు, ఇతర పోలీస్ రెవెన్యూ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశం ఉందని ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనే ఎందుకు సం సిద్ధంగా ఉండాలని అన్నారు. అన్ని మండల కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా సిబ్బందికి నిధులు కేటాయించాలని ఆదేశించారు. గ్రామాల్లో టామ్ టామ్ వేయించి వరద పరిస్థితి ప్రజలకు తెలియజేసి, అప్రమత్తం చేయాలన్నారు అవసరమైన పక్షంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం కోసం అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాలను ముందుగా గుర్తించాలన్నారు. సహాయ పునరావాస కేంద్రాలు ఏర్పాటుకు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. కృష్ణా నది తీరం వెంబడి మండలాలు బందరు, ఘంటసాల, చల్లపల్లి, మోపిదేవి, అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాల్లో వరద పరిస్థితి ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలని తాసిల్దార్ లను ఆదేశించారు. అన్ని పీహెచ్సీలలో పాము కాటు మందు సిద్ధంగా ఉండేలా చూడాలన్నారు. త్రాగునీరు పారిశుద్ధ్యం పై దృష్టి పెట్టాలని ఆదేశించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని ఈ సమాచారం వారికి చేరవేయాలని, అవసరమైన బోట్లను, గజ ఈతగాళ్లను సిద్ధం చేయాలని మత్స్య శాఖ అధికారులను ఆర్డిఓ ఆదేశించారు.
ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు బందర్ ఆర్డీవో కార్యాలయంలో 08672-252486 లాండ్ లైన్ నెంబర్ తో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి 24 గంటలు సిబ్బందికి విధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

దక్షిణ మధ్య రైల్వేలో ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ గా బాధ్యతలు స్వీకరించిన కె. పద్మజ , ఐఆర్‌టిఎస్‌

-దక్షిణ మధ్య రైల్వేలో మొట్ట మొదటి మహిళా ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ విజయవాడ,  నేటి పత్రిక ప్రజావార్త : …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *