-నగర పౌరులను పిలుపునిచ్చిన ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతినెల మూడవ శనివారం స్వచ్ఛత దివస్ నిర్వహించి నగరాన్ని మరింత స్వచ్ఛత వైపు అడుగులు వేయాలనే శుభసంకల్పంతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీష సూచనల మేరకు విజయవాడ నగర పాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ శనివారం ఉదయం 9 గంటలకు ధర్నా చౌక్ లో గల స్వచ్ఛత దివస్ సందర్భంగా నగరానికి మరింత పరిశుభ్ర ప్రాప్తి క్రమంలో నగర పౌరులను పిలుపునిచ్చారు. ప్రతి సచివాలయం పరిధిలో కూడా స్వచతా దివస్ ను నిర్వహించి ప్రతివార్డ్ను, ప్రతి సచివాలయంను మరింత పరిశుభ్రంగా ఉంచాలని అందులో అందరూ స్వచ్ఛందంగా పాల్గొని నగరాన్ని మరింత పరిశుభ్రంగా ఉంచాలని కోరారు.