ప్రభుత్వ ఖజానా ద్వారా పెన్షన్ల ను పొందే వారు లైఫ్ సర్టిఫికెట్ అందజేయాలి

-2025 జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 లోగా సమర్పించాల్సి ఉంటుంది
-జనవరి ఒకటో తేదీ తదుపరి సమర్పించిన వాటినీ మాత్రమే పరిగణన లోనికి తీసుకోవడం జరిగింది
-ఎన్ ఐ సి వెబ్సైట్ “జీవన్ ప్రామాణ్” లో ఆన్లైన్ లో సమర్పించే వెసులుబాటు ఉంది
– జిల్లా ఖజానా అధికారి ఎన్. సత్యనారాయణ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ఉద్యోగము చేసి పదవీ విరమణ చేసి పింఛన్లు మంజూరు కాబడిన ఫించనుదార్లు మరియు కుటుంబ ఫించనుదార్లు ప్రతి సంవత్సరం సమర్పించవలసిన తమ తమ లైఫ్ సర్టిఫికేట్ ( వార్షిక ధృవీకరణ ప్రమాణపత్రం ) ను జనవరి 1, 2025 నుండి ఫిబ్రవరి 28, 2025 లోపు మాత్రమే విధిగా సమర్పించ వలెనని తూ.గో.జిల్లా ఖజానా అధికారి ఎన్. సత్యనారాయణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఆన్లైన్ ద్వారా కూడా సదరు లైఫ్ సర్టిఫికెట్ నిర్ధారణ చేయవచ్చు అని డి టి వో సత్యనారాయణ పేర్కొన్నారు. లైఫ్ సర్టిఫికేట్ ను జీవన్ ప్రమాణ ద్వారా ఆన్లైన్ ద్వారా కూడా సమర్పించే వెసులుబాటు అందుబాటు లో ఉందని, ఆధార్ సంఖ్య ఆధారంగా బయో మెట్రిక్ గుర్తింపు రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఓ టీ పి తో కూడి లైఫ్ సర్టిఫికెట్ అందజేయాలల్సి ఉంటుందన్నారు. వ్యయ ప్రయాసలకోర్చి ట్రెజరీ కి వెళ్ళవలసిన అవసరం లేదన్నారు.

2025 కి సంబంధించి లైఫ్ సర్టిఫికేట్ జనవరి 1 2025 తదుపరి మాత్రమే సమర్పించాలని, జనవరి 1, 2025 కి ముందు గా సమర్పించిన వాటిని పరిగణలోకి తీసుకోవడం జరగదన్నారు. ఈ విషయాన్నీ ప్రభుత్వ పెన్షన్ల దారులు గుర్తుంచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఒక వేళ ముందుగా సమర్పించినప్పటికీ తిరిగి జనవరి 1 2025 తర్వాత మరోసారి ఫిబ్రవరి 28 లోగా విధిగా సమర్పించాలన్నారు . ఈ విషయాన్ని జిల్లాలోని ప్రభుత్వ ఫించనుదారులు అందరూ గమనించగలరని కోరియున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్స్ *జనవరి 2025 1వ తేదీ నుండి ఫిబ్రవరి 2025, 28 తేదీ వరకు మాత్రమే ఆన్లైన్ ద్వారా సిఎఫ్ఎమ్ఎస్ లో పెన్షన్ సొంత లాగిన్ ద్వారా లేదా “ఎన్ఐసి – జీవన్ ప్రామాణ్” ద్వారాలో సబ్మిట్ చేయాలన్నారు. ప్రతి పెన్షన్ దారుడు తప్పనిసరిగా ఫిబ్రవరి 28 లోగా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలని లేని యెడల, ఆన్లైన్ లో అప్లోడ్ చెయ్యనీ వారి పెన్షన్ల ను ఏప్రిల్ నుండి పెన్షన్ నిలుపుదల అవుతుందన్నారు ఈవిషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పదవీ విరమణ, ఫ్యామిలీ పెన్షన్లు పొందుతున్న పెన్షనర్లు ముఖ్యంగా గ్రహించాలి.

* పెన్షనర్ రాష్ట్రంలో ఏప్రాంతంలో నైనా ఉన్నప్పటికీ తనకు దగ్గర్లో నున్న సబ్ ట్రెజరీ ఆఫీసులో జనవరి ఒకటో తేదీ తదుపరి లైఫ్ సర్టిఫికెట్ నేరుగా సమర్పించే చేసే వెసులుబాటు ఉన్నది.

* తను పెన్షన్ తీసుకొనే సబ్-ట్రెజరీ ఆఫీసుకే వచ్చి లైఫ్ సర్టిఫికెట్ అందచేయాలనే నియమం లేదని గ్రహించాలన్నారు. అలాగే పెన్షనర్ కు ఆండ్రాయిడ్ ఫోన్ గాని ఉన్న ఎడల దానిలో NIC జీవన్ ప్రమాణ యాప్ అలాగే ఆధార్ ఫేస్ రికగ్నైజర్ యాప్ లను ఇన్స్టాల్ చేసుకుని ఇంటి వద్దనే లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయవచ్చునని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఉద్యోగుల అంకితభావంతోనే సంస్థ ఎదుగుదల

-కేడిఎల్ఓ కోఆపరేటివ్ సొసైటీ ఉద్యోగుల యూనియన్ రజితోత్సవ సభలలో అతిథులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగులు కార్మికులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *