Breaking News

స్వచ్చాంద్ర-స్వచ్చ దివస్ కార్యక్రమం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
స్వచ్చాంద్ర-స్వచ్చ దివస్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని నగర కమీషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ అన్నారు. శనివారం స్వచ్చాంద్ర-స్వచ్చ దివస్ కార్యక్రమంలో భాగంగా నగరంలోని కలెక్టరేట్ నుండి హిందూ కాలేజీ జంక్షన్ వరకు నిర్వహించిన ర్యాలీని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శానసభ్యులు గల్లా మాధవి మరియు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ లతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కమీషనర్  మాట్లాడుతూ, స్వచ్చాంద్ర-స్వచ్చ దివస్ కార్యక్రమాన్నిరాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని, ఈ కార్యక్రమంలో భాగంగా నగరంలోని కలెక్టరేట్ నుండి హిందూ కాలేజీ జంక్షన్ వరకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను మరియు ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. గతంలో కూడా స్వచ్చత ఎన్నో కార్యక్రమాలు నిర్వహించుట జరిగిందని, కాని ఈ సారి ప్రతి నెల 3వ శనివారం ఒక థీం ప్రకారం కార్యక్రమాలు నిర్వహించుట రాష్ట్ర ప్రభుత్వం కాలండర్ ను రూపొందించిన్దన్నారు. సదరు కార్యక్రమాలలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొంటారని తెలియచేశారు. ప్రభుత్వం ఆశించిన విధంగా ఈ కార్యక్రమాలను విజయవంతం చేస్తామని తెలిపారు. ఈ ర్యాలీ కార్యక్రమాలు నగరంలోని 206 సచివాయాల పరిధిలో నిర్వహిస్తున్నామని, సచివాలయాల పరిధిలో స్వచ్చత పై క్లీన్లీనెస్ పై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, కావున ప్రజలు ఈ కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని, తమ ఇళ్ళ పరిసర ప్రాంతాలను ప్రజలు శుభ్రంగా ఉంచుకొని పరిశుభ్రతను పాటించాలని తెలియచేశారు.
ఈ కార్యక్రమంలూ యం.యల్.ఎ గల్లా మాధవి మాట్లాడుతూ, పర్యావరారణ పరిరక్షణ ప్రతి పౌరుని బాధ్యత అని అందులో భాగంగా స్వచ్చాంధ్ర స్వచ దివస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని,గౌరవ ముఖ్యమంత్రివర్యులు రాష్ట్రాన్ని స్వచ్చాంద్ర గా తీర్చిదిద్దుటకు ప్రతి నెల 3వ శనివారం స్వచ్చత పై కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారన్నారు. గుంటూరు నగరంలో వెస్ట్ టు ఎనర్జీ అనే నినాదంతో ఎక్కడా చెత్త లేకుండా, ఆ చేత్తనుంది ఎనర్జీ తయారు చేయు బృహత్తర కర్యాక్రమాన్ని చేపడుతున్నామని తెలియచేశారు. మన గృహ పరిసరాలను మనమే శుభ్రంగా ఉంచుకోవాలని అప్పుడే మన నగరం, రాష్ట్రం పరిశుభ్రంగా ఉంటుందని, ఈ కార్యక్రమాల పై ప్రజలకు అవగాహన కలిగించుటకు నేడు ఈ ర్యాలీని నగర పాలక సంత ఆధ్వరంలో నిర్వహిస్తున్నామన్నారు.

యం.యల్.ఎ మహమ్మద్ నజీర్ మాట్లాడుతూ, స్వచ్చాంద్ర స్వచ్చ దివస్ అనే నినాదంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర వ్త్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘంగా నిర్వహిస్తున్నారన్నారు. గౌరవ ముఖ్యమంత్రివర్యులు రాష్ట్రంలో ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని తీసుకురావడానికి స్వచ్చత పై ప్రజలకు అవగాహన కలిగించుటకు ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, వారి భాగస్వామ్యం ఉంటె ఇటువంటి కార్యక్రమాలు విజయవంతం అవుతాయన్నారు. గుంటూరు నగరంలో నగర పాలక సంస్థ డోర్ టు డోర్ చెత్త సేకరణ చేస్తుందని, ప్రజలు వ్యర్ధాలను రోడ్ల పై మరియు సైడు కాలువల్లో వేయకుండా తడి పొడి చేత్తలుగా వేరు చేసి పారిశుధ్య సిబ్బందికి అందజేయాలని తెలియచేశారు. నగరంలో మరియు రాష్ట్రంలో ఘన వ్యర్ధాల నిర్వహణ చేయుట ద్వారా స్వచ్చాంద్ర స్వర్ణాంధ్ర చేయుటకు గౌరవ ముఖ్యమంత్రివర్యులు కృషి చేస్తున్నారని తెలియచేశారు.
అనంతరం కల్లెక్టరేట్ నుండి హిందూ కాలేజీ జంక్షన్ వరకు మెగా ర్యాలీ నిర్వహించి, హిందూ కాలేజీ జంక్షన్ వద్ద మానవ హారం నిర్వహించి, స్వచ్చత పై ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు.
సదరు కార్యక్రమంలో జిల్లా యస్.పి యస్. సురేష్ కుమార్ ఐ.పి.యస్, నగర పాలక సంస్థ అదనపు కమీషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటి కమీషనర్లు డి. శ్రీనివాసరావు, సి.హెచ్ శ్రీనివాసరావు, టి. వెంకట కృష్ణయ్య, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధికారులు సిబ్బంది, వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *