విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ ఆదివారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కు సంబంధించిన సమస్యలన్నీ ప్రజలు తమ దగ్గరలోని కార్యాలయంలో సంప్రదించవచ్చని ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు ఫిర్యాదులను స్వీకరిస్తారని అధికారులందరూ జోనల్ కార్యాలయలలో తో పాటు ప్రధాన కార్యాలయంలో కూడా అందుబాటులో ఉంటారని, కావున ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
Tags vijayawada
Check Also
ఉద్యోగుల అంకితభావంతోనే సంస్థ ఎదుగుదల
-కేడిఎల్ఓ కోఆపరేటివ్ సొసైటీ ఉద్యోగుల యూనియన్ రజితోత్సవ సభలలో అతిథులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగులు కార్మికులు …