విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో పోలీస్ అధికారులుగా సెలెక్ట్ అయిన అనేకమందికి అత్యున్నతమైన శిక్షణ ద్వారా వారిని అత్యున్న స్థాయికి చేర్చడంలో కీలకంగా వ్యవహరించిన కె జయంతి రావు 03.01.2025 తేదీన అర్థరాత్రి విశాఖపట్నంలో మరణించారు.
వారి వద్ద అప్పాలో శిక్షణ తీసుకున్న 1991 బ్యాచ్ కి చెందిన ఎస్సైలు ప్రస్తుత డి. ఎస్. పి లు ఈరోజు జయంతి రావు ని స్మరించుకుంటూ బందర్ రోడ్డు లోని నిర్మల హృదయ భవన్ లో జయంతి రావు సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నగర పోలీస్ కమిషనర్ ఎస్ వి రాజ శేఖర బాబు ఐ. పి. ఎస్. పాల్గొని జయంతి రావు గారిని స్మరించుకుంటూ వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నగర పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ….. జయంతి రావు వద్ద తాను కూడా 1998లో శిక్షణ తీసుకున్నారని, వీరు వృత్తిపట్ల నిబద్ధతతో వ్యవహారిస్తూ పలువురు అధికారులకు అత్యున్నత శిక్షణ ఇవ్వడం లో కీలకంగా వ్యవహారించారు అని అన్నారు. విధి నిర్వహణ లో అలుపెరగకుండా నిజాయితీగా ట్రైనీ సిబ్బంది క్రమశిక్షణ, సాహసం, నైపుణ్యం, వృత్తి పట్ల పవిత్రమైన భావన వచ్చే విధంగా తీర్చిదిద్దడం లో ఆయనకు ఆయనే సాటి అని ప్రస్తుతం అయన మనతో లేకపోయినా అయన నేర్పిన అనుభవాలు ఎప్పటికి మనతోనే ఉంటాయాని, జయంతి రావు స్ఫూర్తితో మనం ఎంతో నేర్చుకున్నాం, పోలీస్ శాఖలో అంత నిబద్ధత, క్రమశిక్షణ కలిగిన శిక్షకుడిగా అందరినీ చాలా గొప్పగా తీర్చిదిద్ధిన జయంతి రావు కి మనం అందరం నివాళులు అర్పించడం సముచితం అని అన్నారు. ఈ నేపథ్యంలో నిర్మల్ హృదయ భవన్ లోని శరణారద్దులకు భోజనం ఏర్పాట్లు చేయడం తోపాటు వారికి పండ్లను అందించారు.
ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్ తో పాటు, డి. ఎస్. పి.లు పి. వి.. మారుతీ రావు, అంబికా ప్రసాద్ గారు, ధర్మేంద్ర, రాజీవ్ కుమార్, కిషోర్, రఘురాం మోహన్ మరియు ఇతర పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.