విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్, ఆంధ్రప్రదేశ్/ కలెక్టర్, ఎన్ టి ఆర్ వారి ఆదేశాల మేరకు 81-విజయవాడ తూర్పు నియోజక వర్గ పరిధిలో నేషనల్ ఓటర్లు డే -2025 నిర్వహించవలసినదిగా ఆదేశించి యున్నారు. ది.25.01.2025 తేదీన 15వ జాతీయ ఓటరు దినోత్సవముగా పరిగణించుచు తూర్పు నియోజకవర్గమునకు సంబంధించిన అన్ని గుర్తింపు పొందిన గవర్నమెంటు / ప్రైవేట్ / కాలేజీలకు / ఇన్స్టిట్యూషన్స్ కు ఈరోజు అనగా ది.22.01.2025 @04.00pm ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మరియు రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ , విజయవాడ సబ్ కలెక్టర్ వారి కార్యాలయములో మీటింగ్ ను ఏర్పాటు చేసియున్నారు. సదరు కార్యక్రమములో భాగంగా తూర్పు నియోజకవర్గమునకు సంబంధించిన గుర్తింపు పొందిన గవర్నమెంటు / ప్రైవేట్ / కాలేజీల అనగా 1) ఆంధ్ర లయోలా కాలేజీ, గుణదల 2) పి.బి. సిద్దార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ 3) శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్దార్థ మహిళా కళాశాల, లబ్బీపేట 4) మారిస్ స్టెల్లా కాలేజీ, పటమట 5) ఏ పి ఎస్ ఆర్ ఎం సి హెచ్ స్కూల్, కృష్ణ లంక 6) ఎన్.ఎస్.ఎం పబ్లిక్ స్కూల్, పటమట సెంటర్లలలో నేషనల్ ఓటర్లు డే కార్యక్రమములు ఏర్పాటు చేయవలసినదిగా ఆదేశించి యున్నారు. మరియు యంగ్ ఎలేక్టర్స్ అనగా 18సం,, నిండి కొత్తగా నమోదు అయిన యువత / యువకులకు ఓటు కార్డులు & 80సం,, పై బడిన సీనియర్ సిటిజన్లకు సత్కరించవలసినిదిగా కోరియున్నారు మరియు ర్యాలీలు, రంగావల్లిలు , ప్రతిజ్ఞా చేయవలిసినిదిగా ఆదేశించి యున్నారు. సదరు కార్యక్రమమునకు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్, విజయవాడ, అసిస్టెంట్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ మరియు అడిషనల్ కమీషనర్ జనరల్, నగరపాలక సంస్థ మరియు అన్ని గుర్తింపు పొందిన గవర్నమెంటు / ప్రైవేట్ / కాలేజీల మరియు ప్రినిసిపాల్స్, హెడ్ మాస్టర్స్ మరియు తూర్పు నియోజకవర్గమునకు సంబంధించిన సూపర్ వైజర్లు, డిప్యూటీ తహసీల్దార్ మరియు వారి యొక్క సిబ్బంది పాల్గొనియున్నారు.
Tags vijayawada
Check Also
ఆరోగ్యం, విద్య, ఆవిష్కరణలకే మా ప్రాధాన్యత
-సహకరించాలని బీఎంజీఎఫ్‌కు వినతి -బిల్‌గేట్స్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ దావోస్, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్య, విద్య, ఆవిష్కరణల …