– 3.5 టన్నుల స్థూల వాహన బరువుతో ఈవియేటర్ (EVIATOR (e-SCV)) మరియు 1.2 టన్నుల స్థూల వాహన బరువుతో సూపర్ కార్గో (Super Cargo (ఈ – 3 వీలర్)) ఆవిష్కరించబడ్డాయి
– ఈవియేటర్ (EVIATOR (e-SCV)) వాహనం పరిశ్రమలోనే అత్యుత్తమంగా 245 కి.మీ. సర్టిఫైడ్ రేంజి మరియు 170 కి.మీ. రియల్ లైఫ్ రేంజితో లభిస్తుంది. అత్యధిక శక్తి – 80 kW మరియు టార్క్ – 300 Nm ఉంటాయి. దీనికి 7 సంవత్సరాలు/2.5 లక్షల కి.మీ. వారంటీ ఉంటుంది. ధర రూ. 15.99 లక్షల* నుండి (ఎక్స్-షోరూం ఢిల్లీ) ప్రారంభమవుతుంది.
– సూపర్ కార్గో (Super Cargo (e-3W)) వాహనం పరిశ్రమలోనే అత్యుత్తమంగా 200+ కి.మీ. సర్టిఫైడ్ రేంజి మరియు 150 కి.మీ. రియల్ లైఫ్ రేంజితో, 3 కార్గో బాడీ రకాల్లో లభిస్తుంది. 15 min ఫుల్ చార్జ్ ఆప్షన్‌తో కూడా లభిస్తుంది. ధర రూ. 4.37 లక్షల* నుండి ప్రారంభమవుతుంది.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ఈవియేటర్ (‘EVIATOR’) (ఎలక్ట్రిక్ SCVలు) మరియు సూపర్ కార్గో (ఎలక్ట్రిక్ 3-వీలర్లు) వాహనాలను మోంట్రా ఎలక్ట్రిక్ ఆవిష్కరించింది. సంస్థ చైర్మన్ అరుణ్ మురుగప్పన్, వైస్ చైర్మన్ వెల్లాయన్ సుబ్బయ్య, మేనేజింగ్ డైరెక్టర్ జలజ్ గుప్తా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంస్థ 3 వీలర్ల విభాగం బిజినెస్ హెడ్ రాయ్ కురియన్ మరియు స్మాల్ కమర్షియల్ వెహికల్స్ విభాగం సీఈవో సజు నాయర్ (Saju Nair) కూడా ఇందులో పాల్గొన్నారు.
“మురుగప్ప గ్రూప్‌లో భాగంగా మేము వినూత్నమైన మరియు సుస్థిరమైన, స్వచ్ఛమైన మొబిలిటీ సొల్యూషన్స్‌ను అందించేందుకు కట్టుబడి ఉన్నాం. ‘EVIATOR’ (e-SCV) మరియు సూపర్ కార్గోను భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఆవిష్కరించడంపై సంతోషిస్తున్నాం. ఈ రెండు కొత్త ఉత్పత్తులు మా తదుపరి వృద్ధి మరియు ఆవిష్కరణలకు దన్నుగా నిలుస్తాయి.
అలాగే భారతదేశపు తొలి ఎలక్ట్రిక్ హెవీ కమర్షియల్ 55 టన్నుల ట్రక్ రైనోను (RHINO) కూడా ప్రదర్శిస్తున్నాం. ఇది ఇప్పటికే బహుళ కస్టమర్లకు 5 Mn+ పైచిలుకు కిలోమీటర్లు నమోదు చేసింది. 3W లాస్ట్ మైల్, స్మాల్ కమర్షియల్, హెవీ కమర్షియల్ మరియు ఈ-ట్రాక్టర్లు అనే 4 వ్యాపార విభాగాల్లో విస్తరించిన మోంట్రా ఎలక్ట్రిక్ సంస్థ 2070 నాటికి తటస్థ కర్బన ఉద్గారాల స్థాయిని సాధించేందుకు భారత్ చేస్తున్న కృషిలో కీలక పాత్ర పోషించనుంది” అని మోంట్రా ఎలక్ట్రిక్ (టీఐ క్లీన్ మొబిలిటీ) చైర్మన్ అరుణ్ మురుగప్పన్ తెలిపారు.
“ఈవియేటర్ భారతదేశపు తొలి ట్రూ-ఈవీ (TRU-EV). ఇది అధునాతన డిజైన్, పటిష్టమైన పనితీరు మరియు అసమానమైన మన్నికతో మిడ్-మైల్ మరియు లాస్ట్ మైల్ మొబిలిటీని పునర్నిర్వచిస్తుంది. పరిశ్రమలోనే తొలిసారిగా 245 కి.మీ. సర్టిఫైడ్ రేంజితో చిన్న కమర్షియల్ వాహనాల విభాగంలో ఈవియేటర్ ఒక గేమ్ చేంజర్ కాగలదు. ఫ్లీట్ అప్‌టైమ్ 95 శాతం పైగా ఉండేలా చూసేందుకు ఈవియేటర్‌కి అధునాతన టెలీమ్యాటిక్స్ దన్ను ఉంటుంది. ఈ ప్రోడక్టుకే పరిమితం కాకుండా, అనుకూలీకరించిన చార్జింగ్ మరియు ఆఫ్టర్‌మార్కెట్ సొల్యూషన్స్‌ను అందిస్తూ రోజువారీగా వాహనాన్ని మరింత సమర్ధవంతంగా వినియోగించుకోవడంలో తోడ్పడేందుకు మేము కట్టుబడి ఉన్నాం.
కస్టమర్ల అభిప్రాయాలను క్షుణ్నంగా తెలుసుకుని, వాటికి అనుగుణంగా సూపర్-కార్గో (ఈ 3-వీలర్) రూపొందించబడింది. కేటగిరీలోనే తొలిసారి అనదగిన డ్రైవర్స్ సీట్ బెల్ట్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌లు, విశాలమైన ఎర్గోనామిక్ డ్రైవర్ క్యాబిన్ వంటి విశిష్టమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 15 min ఫుల్ చార్జింగ్ ఆప్షన్ ఉండటం వల్ల B2B సంస్థలకు ఇది మరింత అనువైనదిగా ఉంటుంది. విస్తృత శ్రేణిలో లభించే సూపర్ కార్గో అనేది ఇటు ఫ్లీట్ ఆపరేటర్లు మరియు వ్యక్తిగత ఎంట్రప్రెన్యూర్లకు వివిధ అవసరాలకు ఉపయోగకరంగా ఉంటుంది. దేశవ్యాప్తంగా అప్‌టైమ్ మరింత మెరుగ్గా ఉండేలా మా విస్తృత డీలర్ల నెట్‌వర్క్ తోడ్పడుతుంది,” అని మోంట్రా ఎలక్ట్రిక్ (టీఐ క్లీన్ మొబిలిటీ) మేనేజింగ్ డైరెక్టర్ జలజ్ గుప్తా చెప్పారు.