విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జైళ్ల శాఖ డ్రైవర్ పోస్ట్ లకు మార్చి 2న వ్రాత పరీక్ష నిర్వహిస్తున్నామని జైళ్ల శాఖ డైరక్టర్ జనరల్ కుమార్ విశ్వజిత్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జైళ్ల శాఖలో 5 డ్రైవర్ పోస్ట్ లకు గాను గతంలో నిర్వహించిన డ్రైవింగ్ టెస్ట్ లో పాల్గొని అర్హత సాధించిన 311 మందికి ఈ ఏడాది మార్చి 2న వ్రాత పరీక్షను నెల్లూరు జిల్లా మూలపేట లోని ఏపీ స్టేట్ ట్రైనింగ్ అకాడమి ఫర్ రిఫార్మేషన్ సర్వీసెస్(APSTARS), పాత సెంట్రల్ జైల్ ఆవరణలో నిర్వహించనున్నామని తెలిపారు. ఎల్ఎంవీ అభ్యర్థులు ఉదయం 8గంటలకు, హెచ్ఎంవీ అభ్యర్థులు మధ్యాహ్నం 12గంటలకు పరీక్షా కేంద్రానికి హజరుకావాల్సి ఉంటుందన్నారు. నిర్దేశించిన సమయానికి హజరుకాలేని అభ్యర్థులను పరీక్షా ప్రాంగణంలోకి అనుమతించబడరు అని చెప్పారు. మరింత సమాచారం కోసం http://prisons.ap.gov.in వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించారు.
Tags vijayawada
Check Also
ఆరోగ్యం, విద్య, ఆవిష్కరణలకే మా ప్రాధాన్యత
-సహకరించాలని బీఎంజీఎఫ్‌కు వినతి -బిల్‌గేట్స్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ దావోస్, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్య, విద్య, ఆవిష్కరణల …