-డీపీ వరల్డ్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ
-పోర్టులను పరిశీలించాల్సిందిగా సూచన
దావోస్, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌లో స్మార్ట్ కంటైనర్ టెర్మినల్ ఏర్పాటుకు ముందుకు రావాలని ప్రపంచంలో కంటైనర్ టెర్మినల్‌లో ప్రతిష్టాత్మక సంస్థ డీపీ వరల్డ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో మూడో రోజు డీపీ వరల్డ్ సెంట్రల్ ఏసియా, ఆఫ్రికా మేనేజింగ్ డైరెక్టర్ రిజ్వాన్ సూమర్‌తో ముఖ్యమంత్రి ఈ మేరకు చర్చలు జరిపారు. భారతదేశంలో డీపీ వరల్డ్‌కు 5 కంటైనర్ టెర్మినల్స్ ఉన్నప్పటికీ ఏపీలో ఇప్పటివరకు ఒక్కటీ లేదని, ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ, కృష్ణపట్నం, మూలపేటలో స్మార్ట్ కంటైనర్ టెర్మినల్ ఏర్పాటుకు అవకాశం ఉందన్నారు. దీనిపై ఆలోచన చేయాలని రిజ్వాన్ సుమూర్‌ను ముఖ్యమంత్రి కోరారు. అలాగే రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న సీ పోర్టుల్లోనూ, ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్‌పైనా పెట్టుబడులు పెట్టేందుకు ముఖ్యమంత్రి ఆహ్వానించారు. డీపీ వరల్డ్ 40కి పైగా దేశాల్లో 82 మెరైన్, ఇన్‌ల్యాండ్ టెర్మినల్స్ నిర్వహిస్తోంది. గ్లోబల్ కంటైనర్ ట్రాఫిక్‌లో దాదపు 10 శాతం మార్కెట్ డీపీ వరల్డ్ సొంతం. డీపీ వరల్డ్ రాష్ట్రానికి వస్తే రాష్ట్రం నుంచి అంతర్జాతీయ వాణిజ్యాభివృద్ధికి దోహద పడుతుంది.