విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉద్యోగ అవకాశాలు మెరుగు పరచే దిశగా ఎఫ్ట్రానిక్స్ సిస్టమ్స్ ప్రైవేటు లిమిటెడ్ అధ్వర్యంలో ఈ నెల 2324 తేదీలలో ఎస్. ఆర్.ఎం.యూనివర్సిటీ నందు సిస్టమ్స్ ఇంజనీరింగ్ సమ్మిట్ – 2025 జరుగుతుందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ దాసరి రామకృష్ణ తెలిపారు. నగరంలోని ఓ హోటల్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్ధులకు కొత్త విధానంలో సిస్టమ్స్ పని తీరు గురుంచి విద్యా విధానంలో రానున్న మార్పుల గురించి సిస్టమ్స్ ఇంజనీరింగ్ నిపుణులు రెండు రోజుల సదస్సులో వివరిస్తారని అన్నారు. అలాగే రానున్న కాలంలో రాష్ట్రంలోని కొన్ని విద్యా సంస్థలలో సిస్టమ్స్ ఇంజనీరింగ్ కోర్సు రానున్నది, ఈ విద్యా విధానం అలాగే వివిధ రంగాలలో సిస్టమ్స్ ఇంజనీరింగ్ ప్రాధాన్యత గురించి తెలిపచేస్తారని అన్నారు. ఈ నెల 23 వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు సదస్సు ప్రారంభమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి బోయింగ్ నిపుణులు డాక్టర్ వై.యోగానంద తో పాటు పలువురు విద్యా వేత్తలు వివిధ విశ్వవిద్యాలయాల నిపుణులు హాజరుకానున్నారని అన్నారు.దేశ వ్యాప్తంగా సుమారు 450 కి పైగా. హాజరు కానున్నారని అన్నారు. ఈ సమావేశంలో చీఫ్ ఇంజనీర్ బి. సంబిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ మేనేజర్ ఎస్.భవాని శంకర్ పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రజల నుండి వచ్చేఫిర్యాదులను సకాలంలో హేతబద్ధంగా పరిష్కరించండి
-ఆర్దికేతర ఫిర్యాదులు,అర్జీలను వెంటనే పరిష్కరించాలి -ఫిర్యాదులు ఏవిధంగా పరిష్కరిస్తుందీ ర్యాండమ్ చెకింగ్ నిర్వహిస్తాం -ఫిబ్రవరి రెండవ లేదా మూడవ వారంలో …