గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
భారత రాజ్యాంగ స్పూర్తితో గుంటూరు నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, అభివృద్ధి పనులు చేపట్టడానికి కృషి చేస్తామని నగర కమీషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ అన్నారు. 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆదివారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం, జిన్నాటవర్ సెంటర్ మరియు ఎన్.టి.ఆర్.మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండా ఆవిష్కరణ, హిమని సెంటర్ లోని మహాత్మాగాంధీ, లాడ్జ్ సెంటర్ లో అంబేద్కర్, జి.యం.సి ప్రధాన కార్యాలయంలో బాబు రాజెంద్ర ప్రసాద్ చిత్ర పటానికి యం.యల్.సి కె.యస్ లక్ష్మణ రావు, డిప్యూటి మేయర్ షేక్. సజీల, కార్పొరేటర్లు, విభాగాదిపతులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం యాన్.టి.ఆర్ స్టేడియం లో ఎన్.సి.సి. క్యాడెట్ ల నుండి గౌరవ వందనం స్వీకరించి, విధుల్లో ప్రతిభ చూపిన ఉద్యోగులు, కార్మికులు, సచివాలయ కార్యదర్శులకు ప్రసంశా పత్రాలను అందించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగంగా ఉందని అందుకు అంబేద్కర్ కృషి వెలకట్టలేనిదన్నారు. రాజ్యాంగ స్పూర్తి, రాష్ట్ర ప్రభుత్వ, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ల సహకారంతో గుంటూరు నగర ప్రజలకు అత్యుత్తమమైన సేవలు అందించడానికి కృషి చేస్తామన్నారు. గుంటూరు యం.పి మరియు కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కృషితో మంజూరైన శంకర్ విలాస్ ఆర్.ఓ.బి రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయని, ఆర్.ఓ.బి ప్రభావత భవనాలకు చట్టప్రకారం నస్టపరిహారం అందిస్తున్నామన్నారు. అలాగే ఎ.టి అగ్రహారం మెయిన్ రోడ్డు, నందివెలుగు రోడ్డు విస్తరణ పనులు పూర్తి కావచ్చాయని, లాల్పురం రోడ్డులోని గెలాక్సీ బార్ వద్ద, రెడ్డి పాలెం మెయిన్ రోడ్డు, తారకరామ నగర్ రోడ్లు మాస్టర్ ప్లాన్ ప్రకారం విస్తరణ చేయుటకు ప్రతిపాదనలు సిద్దం చేయబడ్డాయన్నారు. నగరంలో అస్తవ్యస్తంగా ఉన్న వీధి వ్యాపారులను క్రమబద్దీకరిస్తూ హాకర్ జోన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని, ఆక్రమణల తొలగింపు నిరంతర ప్రక్రియగా చేస్తునామన్నారు. జి.యం.సి పరిధిలో రూ. 3.90 కోట్లతో ప్రధాన రోడ్ల మరమ్మతులు, రూ.2.73 కోట్ల ఎన్.క్యాప్ నిధులతో నూతన రోడ్ల ఏర్పాటు పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. 2024-25 సంవత్సరంలో నగరంలో సుమారు 115.52 కోట్లతో మౌలికవసతులైన రోడ్లు, డ్రైన్లు, త్రాగునీటి వసతుల ఏర్పాటు పనులు వివిధ దశలలో ఉన్నాయన్నారు. కీలకమైన ప్రజారోగ్య విభాగంలో మెరుగైన పారిశుధ్య సేవలు అందించడానికి శానిటరీ డివిజన్ల పెంపు, కార్మికుల రేశానలైజేషణ్, ఈ ఆటోల మరమ్మతుల కొరకు ప్రత్యేక మెకానికల్ టీం, జి.టి.యస్ ల ఏర్పాటుకు శంకుస్తాపన చేశామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు జిల్లా మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో రానున్న కాలంలో గుంటూరు నగరాన్ని మరింతగా అభివృద్ధి చేసుకున్తానికి జి.యం.సి సిబ్బంది యావత్తు కృషి చేస్తామని తెలిపారు.
యం.యల్.సి కె.యస్ లక్ష్మణ రావు మాట్లాడుతూ, భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్ళు పూర్తి చేసుకున్నామని, ఈ సందర్భంగా రాజ్యాంగ పరిషత్ చైర్మన్ బాబు రాజేంద్ర ప్రసాద్, ముసాయిదా కమిటీ చైర్మన్ బి.ఆర్ అంబేద్కర్ గార్లకు నివాళులు అర్పిస్తున్నమన్నారు. భారత దేశం ప్రజాస్వామ్య దేశంగా, ఎన్నికలు జరగడానికి, ప్రజలకు సార్వభౌమాధికారం ఉండటానికి రాజ్యంగా ఎంతగానో దోహదం చేస్తుందన్నారు. ఇప్పటికి దేశంలో 18 ఎన్నికలు జరిగాయని దేశానికి రాజకీయ స్వాతంత్య్రమే వచ్చిందని, ఆర్ధిక, సామాజిక స్వాతంత్రయాల కోసం చాలాదూరం ప్రయాణించాల్సి ఉందన్నారు.
కార్యక్రమంలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటీ కమిషనర్లు డి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, టి. వెంకటకృష్ణయ్య, సిటి ప్లానర్ రాంబాబు. సిఎంఓహెచ్ డాక్టర్ అమృతం, ఎంహెచ్ఓ డాక్టర్ రవిబాబు, మేనేజర్ బాలాజీ బాషా , కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
మంత్రి గొట్టిపాటి అధ్యక్షతన ఐదు రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రుల సమావేశం
-డిస్కంలను లాభాల బాట పట్టించే అంశాలపై మంత్రుల చర్చ -బ్యాటరీ స్టోరేజ్ కెపాసిటీని వెయ్యి నుంచి రెండు వేల మెగావాట్లు …